4
1 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నియామకమైన ఆ రోజు✽ రాబోతుంది. అది కాలుతూ✽ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులందరూ, చెడుగు చేసే ప్రతీ వ్యక్తీ ఎండుగడ్డిలాగా ఉంటారు. రాబోయే ఆ రోజున వారు కాలిపోతారు. వారికి వేరు గానీ కొమ్మ గానీ మిగలదు. 2 అయితే, నా పేరంటే✽ భయభక్తులున్న మీకు న్యాయోదయం✽ అవుతుంది. దాని అంచులు✽ ఆరోగ్యాన్ని✽ చేకూరుస్తాయి. కొట్టం విడిచిన దూడలలాగా✽ మీరు బయటికి వెళ్ళి కుప్పిగంతులు వేస్తారు. 3 ✽ నేను నియమించే ఆ రోజున దుర్మార్గులు మీ కాళ్ళ క్రింద బూడిదలాంటివారవుతారు. మీరు వారిని అణగద్రొక్కివేస్తారు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.4 “నా సేవకుడు మోషే✽ ధర్మశాస్త్రం, అంటే ఇస్రాయేల్ ప్రజలందరి కోసం హోరేబు పర్వతం మీద నేను అతనికి ఇచ్చిన చట్టాలు, న్యాయ నిర్ణయాలు జ్ఞాపకముంచుకోండి✽.