14
1 వినండి! మీ✽ దోపిడీసొమ్మును మీ మధ్య పంచిపెట్టే యెహోవా దినం✽ రాబోతుంది. 2 “జనాలన్నిటినీ✽ జెరుసలంమీద యుద్ధం చేయడానికి✽ వాటిని సమకూర్చి రప్పిస్తాను✽.” వారు నగరాన్ని పట్టుకొంటారు. ఇండ్లను దోచుకొంటారు. స్త్రీలను చెరుపుతారు. నగరవాసులలో సగంమంది బందీలుగా దేశాంతరం పోతారు. అయితే తక్కినవారు నాశనం కాకుండా నగరంలో ఉండిపోతారు. 3 అప్పుడు యెహోవా బయలుదేరి యుద్ధకాలంలో✽ పోరాడే విధంగా ఆ జనాలతో యుద్ధం చేస్తాడు. 4 ✽ఆ రోజున✽ ఆయన జెరుసలంకు తూర్పుగా✽ ఉన్న ఆలీవ్ కొండమీద పాదాలు ఉంచుతాడు✽. ఆలీవ్‌కొండ తూర్పు దిక్కుకూ పడమటి దిక్కుకూ నడిమికి చీలిపోతుంది. సగం కొండ ఉత్తర దిక్కుకు, సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగిపోతుంది, మధ్యలో మహా గొప్ప లోయ ఏర్పడుతుంది. 5 కొండల మధ్య నేను చేసే ఆ లోయ ఆజీల్✽ వరకు ఉంటుంది. మీరు✽ ఆ లోయగుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం✽ వచ్చినప్పుడు ప్రజలు పారిపోయినట్టు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడు యెహోవా✽ వస్తాడు. నీతోపాటు పవిత్రులందరూ✽ వస్తారు.6 ఆ రోజున వెలుగు ఉండదు✽ జ్యోతుల ప్రకాశం తగ్గిపోతుంది. 7 ✽అది వింతైన రోజుగా ఉంటుంది పగలు కాదు, రాత్రీ కాదు. ఆ రోజు యెహోవాకు తెలుసు. సాయంకాలం సమయాన వెలుగు ఉంటుంది. 8 ✝ఆ రోజున క్రొత్త నీటి ధారలు జెరుసలంలో నుంచి వెలువడతాయి. సగం తూర్పు సముద్రానికి✽, సగం పడమటి సముద్రానికి పారుతుంది. ఎండకాలంలోను చలికాలంలోను అలాగే పారుతూ ఉంటుంది.
9 యెహోవా✽ సర్వలోకానికి రాజై ఉంటాడు✽. ఆ కాలంలో యెహోవా ఒక్కడే ప్రభువై ఉంటాడు. ఆయన పేరు ఒక్కటే ఉంటుంది.
10 ✽అప్పుడు గెబనుంచి జెరుసలంకు దక్షిణంగా ఉన్న రిమ్మోనువరకు ఆ ప్రదేశమంతా మైదానం అవుతుంది. జెరుసలం ఎత్తుగా✽ ఉంటుంది. “బెన్యామీను ద్వారం” నుంచి “మూలద్వారం” (మొదటిద్వారం ఉన్నస్థలం) వరకూ, హననయేల్ గోపురంనుంచి రాజు ద్రాక్ష గానుగవరకూ జెరుసలం దాని స్థలంలోనే నిలుస్తుంది. 11 మనుషులు దానిలో నివాసం ఉంటారు. అప్పటినుంచి అది ఎన్నడూ నాశనానికి గురి కాదు✽. జెరుసలం సురక్షితంగా ఉంటుంది.
12 జెరుసలంమీద యుద్ధం చేసిన✽ జనాలన్నీ యెహోవాచేత ఇలా దెబ్బ తింటాయి: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి. వారి కండ్లు కనుతొర్రలలో ఉండికూడా కుళ్ళిపోతాయి. వారి నాలుకలు నోళ్ళలో ఉండి కూడా కుళ్ళిపోతాయి. 13 ✝ఆ రోజున యెహోవా వల్ల వారికి గొప్ప భయాందోళన ముంచుకు వస్తుంది. వారంతా ఒకరినొకరు పట్టుకొంటారు. ఒకరినొకరు దెబ్బ తీస్తారు. 14 యూదా✽వారు కూడా జెరుసలందగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూరా ఉన్న ఇతర జనాల ధనమంతా చాలా బంగారం, వెండి, వస్త్రాలు అక్కడ పోగు చేయడం✽ జరుగుతుంది. 15 ఆ దెబ్బలాంటిది వారి శిబిరాలలో ఉన్న గుర్రాలకూ✽ కంచరగాడిదలకూ ఒంటెలకూ గాడిదలకూ పశువులన్నిటికీ తగులుతుంది.
16 జెరుసలం పైబడ్డ ఆ జనాలలో మిగిలేవారంతా ఏటేటా జెరుసలంకు వస్తారు. రాజూ సేనలప్రభువూ అయిన యెహోవాను ఆరాధించడానికి✽ పర్ణశాల పండుగ✽ ఆచరించడానికి వస్తారు. 17 ✽ఒకవేళ లోక జనాలలో ఏ జనమైనా రాజూ సేనలప్రభువూ అయిన యెహోవాను ఆరాధించడానికి జెరుసలంకు రాకపోతే వారికి వాన కురియదు. 18 ఈజిప్ట్ ప్రజ రాకపోతే, ఆరాధనలో పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. పర్ణశాల పండుగ ఆచరించడానికి రాని ఇతర జనాలకు యెహోవా నియమించిన ఆ దెబ్బ వారికి తగులుతుంది. 19 ఈజిప్ట్‌వారూ పర్ణశాల పండుగ ఆచరించడానికి రాని ఇతర జనాలన్నీ పొందవలసిన శిక్ష అదే.
20 ✽ఆ కాలంలో గుర్రాలకు కట్టిన గంటలమీద “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసి ఉంటుంది. యెహోవా ఆలయంలో ఉన్న వంట పాత్రలు బలి✽ పీఠం ఎదుట ఉన్న గిన్నెల్లాగే పవిత్రంగా ఎంచబడతాయి. 21 జెరుసలంలోను యూదాలోను ఉన్న పాత్రలన్నీ సేనలప్రభువు యెహోవాకు పవిత్రం అవుతాయి. బలి అర్పించడానికి వచ్చేవారంతా ఆ పాత్రల్లో కావలసినవాటిని తీసుకొని వంట చేసుకొంటారు. ఆ కాలంలో కనాను జాతివాడెవడూ✽ సేనలప్రభువు యెహోవా ఆలయంలో ఉండడు.