పరమగీతం
1
1 సొలొమోను రచించిన పరమ గీతం.✽ఆమె
2 ✽నోటి ముద్దులతో ఆయన నన్ను
ముద్దాడుతాడు గాక!
నీ ప్రేమానురాగాలు ద్రాక్షరసం కంటే మధురం!
3 ✽నీవు పూసుకొనేవి సువాసన గల పరిమళ
తైలాలు.
నీ పేరు ఒలకబోసిన పరిమళ తైలంతో సాటి.
కన్యలకు నీవంటే ఎంతో మక్కువ.
4 ✽నన్ను తీసుకుపో. మనం✽ పరుగెత్తుకుంటూ వెళ్దాం.
రాజు తన లోపలి గదులలోకి నన్ను
తీసుకువచ్చాడు.
చెలికత్తెలు
నిన్ను బట్టి మాకు సంతోషం, ఆహ్లాదం.
ద్రాక్షరసం కంటే కూడా నీ ప్రేమానురాగాలను
ఎక్కువగా కొనియాడుతాం.
ఆమె
వారు నిన్ను ప్రేమించడం✽ తగిన విషయమే.
5 ✽జెరుసలం కుమార్తెలారా! నేను నల్లటి✽ పిల్లనే.
అయినా నేను సౌందర్యవతిని.
కేదార్‌వాళ్ళ డేరాల్లాగా, సొలొమోను భవనంలోని
తెరల్లాగా నల్లటిదాన్నే.
6 నల్లపిల్ల✽నంటూ నన్ను తేరిచూడకండి.
ఎండకు నా శరీరం కమిలిపోయింది.
నా తల్లి కొడుకులు నామీద కోపగించారు✽.
నన్ను ద్రాక్షతోట✽కు కావలిదాన్నిగా వినియోగించారు.
అయితే నా సొంత తోటను కాపాడుకోలేకపోయాను.
7 ✽నా ప్రాణప్రియా! నీ గొర్రెల మందను మేపడానికి
ఎక్కడికి వెళ్తావు?
మధ్యాహ్నం మండుటెండలో వాటిని విశ్రాంతికి
ఎక్కడికి తోలుకువెళ్తావు?
నాతో చెప్పవూ?
నీ స్నేహితుల దగ్గర ముసుకు వేసుకొన్నదానిలా
నేను ఉండడం ఏం బావుంటుంది చెప్పు?
ఆయన
8 ✽అతి లోక సౌందర్యవతీ! నీకింకా తెలియదా?
మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు.
కాపరుల డేరాల దగ్గర నీ మేక పిల్లలను
మేపుకో,
9 ✽ప్రియసఖీ! ఈజిప్ట్‌చక్రవర్తి రథాలకు
పూన్చిన ఆడు గుర్రంలాంటి దానివి నువ్వు.
10 కర్ణ భూషణాల మధ్య నీ చెక్కిళ్ళు ఎంత చక్కనివి!
హారాలు ధరించిన నీ మెడ ఎంత అందమైనది!
11 నీకు బంగారు గొలుసులు చేయిస్తాం.
వాటిలో వెండి పూలు పొదిగి ఉంటాయి.
ఆమె
12 ✽రాజు బల్లదగ్గర కూర్చుని ఉన్నాడు.
నా పరిమళం అంతటా గుభాళించింది.
13 ✽నా వక్షస్థలంపై ఉన్న బోళంలాంటివాడు
నా ప్రియుడు.
14 ఏన్‌గెదీ ద్రాక్షవనిలో వికసించిన గోరింటచెట్టు
పూలలాంటివాడు ఆయన.
ఆయన
15 సౌందర్యవతి✽వి నువ్వు! ప్రియసఖీ✽!
నువ్వెంత సౌందర్యవతివి!
నీ కండ్లు అచ్చం గువ్వ కండ్లే✽.
ఆమె
16 ✽ప్రియతమా! సౌందర్యమంటే నీదే!
నీ ముఖాకృతి ఎంత మనోహరమైనది!
పచ్చని✽ చోట్లు మనకు పాన్పులు.
ఆయన
17 ✽మన గృహానికి దేవదారు దూలాలు.
వాసాలు సరళ వృక్షం మ్రానులు.