31
1 ✽ఇవి లెమూయేల్‌రాజు రాసిన మాటలు, అతడికి అతడి తల్లి✽ నేర్పిన దేవోక్తి✽.2 ✝నా కుమారా, నేనేం చెప్పను? నా కన్న కుమారా, నా వ్రత ఫలమైన కుమారా, నేనేమనేది?
3 ✝నీ బలాన్ని స్త్రీల పాలు చెయ్యకు. రాజులను నాశనం చేసే స్త్రీలతో స్నేహం చెయ్యకు.
4 ✽ ద్రాక్ష మద్యం త్రాగే అలవాటు రాజులకు తగదు. లెమూయేలూ, అది రాజులకు తగనే తగదు. మద్యపానంకోసం ఆశించడం అధికారులకు తగదు.
5 త్రాగితే వారు న్యాయమైన చట్టాలను మరచిపోతారు. దీనదశలో ఉన్నవారందరికీ అన్యాయం చేస్తారు.
6 ✽ప్రాణం పోయేవారికి మద్యం త్రాగించు. దుఃఖంలో మునిగినవారికి ద్రాక్షరసం ఇవ్వు.
7 అలాంటివాళ్ళు త్రాగి తమ దరిద్రాన్ని మరచిపో గలుగుతారు. తమ కష్టాలు జ్ఞాపకం చేసుకోకుండా ఉండగలుగుతారు.
8 ✝నోట్లో నాలుక లేనివాళ్ళ పక్షాన, దిక్కుమాలిన వారి పక్షాన నీవే మాట్లాడు.
9 నీ నోరు తెరువు. న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు – దీనదశలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి న్యాయం చేకూరేలా చూడు.
10 ✽సుగుణం, సామర్థ్యం గల భార్య దొరకడం అరుదు. అలాంటి భార్య రత్నాలకంటే అమూల్యం.
11 ✝ఆమె భర్త ఆమెను నమ్ముతాడు. అతని లాభం ఎప్పుడూ తరగదు.
12 ✽ఆమె బ్రతికినన్నాళ్ళూ అతడికి చేకూర్చేది మేలే గాని, కీడు కాదు.
13 ఆమె మంచి ఉన్నినీ నారనూ ఎన్నుకొని చేతులతో కష్టించి పని చేస్తుంది.
14 వర్తకం చేసే ఓడలలాగా ఆమె దూరంనుంచి ఆహార పదార్థాలను సేకరించి తెస్తుంది.
15 ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె లేస్తుంది. తన ఇంటివారికి భోజనం సిద్ధం చేస్తుంది. తన పని మనుషులకు బత్తెం కొలిచి ఇస్తుంది.
16 ఆమె పొలం చూచి బాగా ఆలోచించుకొంటుంది. డబ్బు వెనక వేసి ద్రాక్షతోట నాటిస్తుంది.
17 ఆమె నడుం కట్టి బలంగా పని చేస్తుంది. తన పనికి తన చేతులు బలమైనవి.
18 ఆమె స్వానుభవంతో లాభసాటి బేరం చేస్తుంది. రాత్రిపూట ఆమె దీపం ఆరిపోదు.
19 ఆమె పంటెకోల చేతపట్టుకుంటుంది. తన వేళ్ళతో కదురు పట్టుకొని వడుకుతుంది.
20 బీదవాళ్ళకు చెయ్యి చాచి ధర్మం చేస్తుంది. అక్కరపడ్డ వారికి కూడా చేయి చాచి ఇస్తుంది.
21 చలికాలంలో ఇంట్లో వారికి చలివేస్తుందేమో అని ఆమెకేమీ భయం లేదు: వారంతా ఎర్రరంగు బట్టలు వేసుకుంటారు.
22 ఆమె పడకలకోసం రత్నకంబళ్ళు తయారు చేస్తుంది. ఆమె ఊదారంగు గల శ్రేష్ఠమైన సన్న బట్టలు తొడుక్కుంటుంది.
23 ఆమె భర్త ప్రాంతీయ పెద్దలతోపాటు గుమ్మందగ్గర కూర్చుంటాడు. అక్కడ అతడికి మంచి పేరు వస్తుంది.
24 ఆమె నూలు వస్త్రాలు నేయించి అమ్ముతుంది. వర్తకులకు నడికట్లు కూడా అమ్ముతుంది.
25 బలమూ గౌరవమూ వస్త్రాలుగా ధరిస్తుంది. ఆమె భవిష్యత్తు విషయం ధైర్యంగా ఉంటుంది.
26 ఆమె నోట జ్ఞానం ఉట్టిపడుతుంది. ఆమె ఇచ్చే ఉపదేశం దయగలది.
27 ఆమె తన ఇంటి వ్యవహారాలు బాగా చూచుకుంటుంది. ఆమె బద్ధకంగా ఉండదు. పని చేసి భోజనం చేస్తుంది.
28 ✽ఆమె సంతానం నిలబడి ఆమెను “ధన్య” అంటారు. ఆమె భర్త కూడా ఆమెను ఇలా మెచ్చుకుంటాడు:
29 ✽“చాలామంది ఆడవాళ్ళు సుగుణం, సామర్థ్యం ప్రదర్శిస్తారు. గాని, నువ్వు వాళ్ళందరినీ మించినదానివి.”
30 ✽ అందం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా అంటే భయభక్తులున్న స్త్రీ స్తుతులు అందుకొంటుంది.
31 ✽ఆమె చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వు. ఆమె చేసిన క్రియలను ఊరి గుమ్మం దగ్గర పొగడుతారు గాక!