99
1 ✽యెహోవా పరిపాలన చేస్తున్నాడు.జనాలు వణికిపోతాయి.
ఆయన కెరూబులకు✽ పైగా సింహాసనాసీనుడు.
భూమి కదిలిపోతుంది.
2 ✝సీయోనులో యెహోవా గొప్పవాడు.
ఆయన సర్వలోక ప్రజలకు ఉన్నతంగా ఉన్నాడు.
3 నీ పేరు✽ గొప్పది, భయభక్తులు కొలుపుతుంది.
వారు దానిని స్తుతిస్తారు. యెహోవా పవిత్రుడు✽.
4 ✝న్యాయమంటే ఎంతో ఇష్టమున్న రాజును
నీ నిజాయితీని బట్టి సుస్థిరంగా నిలబెట్టావు.
యాకోబుప్రజలపట్ల నీవు ధర్మాన్ని, న్యాయాన్ని
జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను ఘనపరచండి.✽
ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి.
ఆయన పవిత్రుడు.
6 ✽ఆయన యాజులలో మోషే, అహరోను ఉన్నారు.
ఆయన పేరెత్తి ప్రార్థించేవారిలో సమూయేలు
ఉన్నాడు.
వారు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు
ఆయన జవాబిచ్చాడు.
7 మేఘస్తంభం✽లో నుంచి ఆయన వారితో మాట్లాడాడు.
వారు ఆయన శాసనాలను అనుసరించారు.
ఆయన తమకు ప్రసాదించిన ధర్మశాస్త్రాన్ని
పాటించారు.
8 ✽ యెహోవా, మా దేవా, నీవు వారికి జవాబిచ్చావు.
వారిపట్ల నీవు పాపక్షమాపణ ప్రదర్శించే దేవుడివి.
అయినా వారి అక్రమకార్యాలకు ప్రతీకారం చేశావు.
9 మన దేవుడు యెహోవా పవిత్రుడు గనుక
మన దేవుడు యెహోవాను ఘనపరచండి.
ఆయన పవిత్ర పర్వతం ఎదుట సాష్టాంగపడి
ఆరాధించండి.