గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
13
1 యెహోవా, ఎన్నాళ్ళు✽ నన్ను నీవు మరచిపోతావు?ఎల్లకాలమా?
ఎన్నాళ్ళు నాకు నీ ముఖం కనబడకుండా చేస్తావు?
2 ✽ఎంతకాలమని నా తలంపుల వల్ల ఈ బాధ?
ఎంతవరకు నా హృదయంలో ప్రతి రోజూ
ఈ శోకం ఉంటుంది?
శత్రువులు ఎంతవరకు నా మీద రెచ్చిపోతారు?
3 ✽యెహోవా, నా దేవా! నావైపు చూడు!
నేనడిగిన దానికి జవాబియ్యి!
నా కన్నులకు వెలుగు ప్రసాదించు!
లేకపోతే అది నాకు మృత్యు నిద్ర
అవుతుందన్న మాటే!
4 అప్పుడు నా శత్రువు తానే గెలిచినట్టు
చెప్పుకుంటాడు.
నేను పడిపోతే నా పతనానికి నా పగవాళ్ళు
సంతోషంతో ఉప్పొంగిపోతారు.
5 ✽నేనైతే నీ అనుగ్రహం మీద నమ్మకం ఉంచాను.
నీ రక్షణలో నా హృదయం ఆనందిస్తుంది.
6 యెహోవా నాకు మేలు చేశాడు.
గనుక నేను ఆయనకు సంకీర్తనం చేస్తాను.