10
1 అహష్‌వేరోషుచక్రవర్తి తన రాజ్యంలో, సముద్ర ద్వీపాలలో ఉంటున్నవాళ్ళు పన్ను చెల్లించాలని నిర్ణయించాడు. 2 బలప్రభావాలతో చేసిన అతని చర్యలూ, అతడు మొర్‌దెకయిని గౌరవించిన విషయమంతా మాదీయుల, పారసీకుల రాజ్య చరిత్రగ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 3 యూదుడు మొర్‌దెకయి అహష్‌వేరోషు చక్రవర్తికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతడు యూదులలో ఘనుడు. తన ప్రజల క్షేమంకోసం ప్రయాస పడేవాడు. తన జాతి అంతటి శ్రేయస్సును వృద్ధి చేయడానికి ప్రయత్నించేవాడు. అనేకులైన తన సాటి యూదులకు ఇష్టుడు.