మహిమ నీకే ప్రభు
472
పల్లవి: మహిమ ప్రభు నీకే-ఘనత ప్రభు నీకే
స్తుతి ఘనత మహిమయు-ప్రభావము ప్రభు నీకే
అ.ప: ఆరాధనా..ఆరాధనా..నా ప్రియ యేసు నీకే
నా ప్రియ ప్రభు నీకే
ఆహహ హల్లెలూయా… “3” ఆమెన్‌
1 సమీపింపరాని-తేజస్సు నందు-వసియించు అమరుండవే
శ్రీ మంతుడవే-సర్వాధిపతివే-నీ సర్వము నాకిచ్చితివే “ఆరాధనా”
2 ఎంతో ప్రేమించి-నాకై ఏతెంచి-ప్రాణము నరిపించివే
విలువైన రక్తం-చిందించి నన్ను-విమోసించితివే “ఆరాధనా”
3 ఆశ్చర్య కరమైన-నీ వెలుగుల లోనికి నను-పిలిచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్‌-ధరనే ప్రచురింప-ఏర్పరచు కొంటివే “ఆరాధన”
4 రాజులైన యాజక- సమూహముగా-ఏర్పరచబడిన వంశమై
పరిశుద్దమైన-నీ సొతైన ప్రజగా-నన్ను జేసితివే “ఆరాధన”