నీ దయలో
446
పల్లవి: నీ దయలో నేనున్న ఇంతకాలం
నీ కృపలో దాచినావు గతకాలం
నీ దయలేనిదే నేనెమౌదునో తెలియదయ్య(2) “నీ దయలో”
1 తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చెయాలని ఆశిస్తారు అందనంత గోప్పవారిగా(2)
నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా(2)
నీ సిలువ నీడలోనే నను దాచి ఉంచాలని
నా శేషజీవితాన్ని నీతోనే గడపాలని“నీ దయలో”
2 నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాధి కోరలకు అంటకుండా దాచావు
నీ రెక్కల నీడలే నాకు ఆశ్రయా దుర్గము
ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా(2)
నీ పాదాలచెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని“నీ దయలో”