దీనులకు విందులు
435
పల్లవి: దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర
వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా!
1 రండి వినరారండి
యేసయ్య ఎవరో తెలిసికొనరారండి
నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి“వీనులకు”
2 రండి వచ్చిచూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి“వీనులకు”
3 సృష్టికర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా?
భూమ్యాకాశాలను సృష్టిగ మార్చేది యేసయ్యేనండి“వీనులకు”