కృపలను తలంచుచు
386
పల్లవి: కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఙతతో స్తుతింతున్‌
1 కన్నీటిలోయలలో-నే కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం-యేసు “కృపలను”
2 రూపింపబడుచున్న-యే ఆయుధముండినను
నాకు విరోధమై వర్థిల్లదుయని
చెప్పిన మాట సత్యం-ప్రభువు“కృపలను”
3 సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిల్పెను-యిహలో“కృపలను”
4 హల్లేలూయా ఆమేన్‌-హా! నాకెంతో ఆనందమే
సీయోన్‌ నివాసము నా కెంతో ఆనందం
ఆనందమానందమే-ఆమేన్‌“కృపలను”