ప్రభువా నిన్ను కీర్తించుటకు
347
పల్లవి: ప్రభువా నిన్ను కీర్తించుటకు-వేనోలుచాలునా
దేవా నిన్ను అర్పించుటకు పొట్టెలు చాలునా
ఎంతగా నిన్ను కీర్తించినన్ను -ఏమేమి అర్పించినను
నీ ఋణమునే తీర్చగలనా-తగ్గిన కానుక నీకర్పించ గలన (2)“ప్రభువా”
1 కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి-నా గుడారమునే విశాలపరిచి (2)
ఇంతగా నన్ను హెచ్చించుటకు నే తగుదున-నే తగుదున
ఇంతగా నన్ను దీవించుటకు నే నర్హుడనా-నే నర్హుడనా “ప్రభువా”
2 నీ నోటి మాట నా ఊటగా నుంచి నా జీవితమునే నీ సాక్షిగా నిలిపి (2)
ఇంతగా నన్ను వాడుకొనుటకు నే తగుదున-నే తగుదున
ఇంతగా నన్ను దీవించుటకు నే నర్హుడనా-నే నర్హుడనా “ప్రభువా”