శక్తి గల యేసుక్రీస్తు నామములో
328
పల్లవి: శక్తి గల యేసుక్రీస్తు నామములోజయము పొందుతాను నేను అన్నిటిలో
యేసులో నిలిస్తే గొప్ప జయము
యేసుతో నడిస్తే లేదు భయము (2)
1 బల్లశాలి గొల్యాతును చిన్న రాయితో
పడగొట్టెను దావీదు దైవ బల్లముతో (2)
దేవునిపై ఉంచేదను విశ్వసము
దేవుని కర్పించేదను నా జీవితము (2) “యేసులో”
2 లెక్క లేని శత్రువులను కొద్ది మందితో
గెలిసినాడు యెహోషువ ప్రార్ధనాత్మతో (2)
ప్రార్ధనతో గెలిచేదను సమస్తము
లోకములో నిలిచేదను ప్రభుకోసము (2) “యేసులో”