హల్లెలూయా అని పాడి స్తుతించెద
228
పల్లవి: హల్లెలూయా అని పాడి స్తుతించెదరారే జనులారా మనసారా ఊరూర (2)
1 పాడి పంటలనిచ్చి- పాలించు దేవుడని
కూడు గుడ్డలనిచ్చి- పోషించు దేవుడని
తోడు నీడగ నిన్ను కాపాడు నాధుడని
పూజించి పూజించి పాటించి చాటించరారే (2)
2 తాత ముత్తాల కన్న ముందున్న దేవుడని
తల్లి తండ్రుల కన్న ప్రేమించు దేవుడని
కల్లాకపటము లేని కరుణా సంపర్ణుడని
పూజించి పూజించి పాటించి చాటించరారే (2)
3 బంధుమిత్రుల కన్న- బలమైన దేవుడని
అన్నదముల కన్న- ప్రియమైన దేవుడని
కన్న బిడ్డలాక- కన్నుల పండుగాని
పూజించి పూజించి పాటించి చాటించరారే (2)
4 రాజాధి రాజుల కన్న- రాజైన దేవుడని
నీచాతి నీచులను- ప్రేమించ వచ్చెనని
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని
పూజించి పూజించి పాటించి చాటించరారే (2)