ఆశ్చర్యములు-నీ కార్యములు
204
పల్లవి: ఆశ్చర్యములు - నీ కార్యములుదేవుని కార్యములు - ఆశ్చర్యములు
దేవుని కార్యములు - ఆశ్చర్యములు “ఆశ్చర్యము”
1 యేసు నామము ఎరిగిన బిడ్డలు -యేక మనస్సుతో ప్రార్దించగా (2)
పరిశుద్దాత్మతో నిండినవారై- దేవుని కార్యములు వివరించిరి “ఆశ్చర్యము”
2 యేసు నెరిగిన పౌలు, సీలలు -యేసు వార్తను ప్రకటించుచూ (2)
పట్టణములను గలిబిలి చేసిరి - ప్రజలను కలవర పరచిరి “ఆశ్చర్యము”
3 చెరలో పేతురు బంధించబడి - సంఘమంతా గలిబిలి రేగెను (2)
దేవుని దూత విడిపించెను - సైనికులలో గలిబిలి రేగెను “ఆశ్చర్యము”
4 యేసు నెరిగిన యోహాను, పేతురు - యేసు నామము ప్రార్దించగా (2)
కుంటివాడు దిగ్గున లేచెను - నడుచుచూ దేవుని స్తుతించెను “ఆశ్చర్యము”