ఆరాధన ఆరాధన
203
పల్లవి: ఆరాధన ఆరాధన ప్రభుయేసు క్రీస్తుకే ఆరాధనస్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాధి రాజుకే స్తుతి కీర్తన (2)
జీవాధిపతియైన యెహోవాకు
ప్రభువుల ప్రభువై యేసునకు
నే పాడెదాన్ కొనియాడెదాన్
కొనియాడి కీర్తించెదాన్ {4} “ఆరాధ”
1 చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభుయేసు
మరణము నుండి జీవమును నడిపెను నను క్రీస్తు (2)
మార్గము సత్యము జీవము నా యేసే (2)
నా గమ్యము నా సర్వము నా ఉన్నతమైన కోట {4} “ఆరాధ”
2 మోడైపోయిన నా బ్రతుకు చిగురింపజేసెను ప్రభుయేసు
తన ద్రాక్షవల్లిలో ఒక తీగెగా నాటెను నను క్రీస్తు (2)
ఆత్మఫలము ఫలియించెదను నా ప్రభు యేసులో (2)
చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును {4} “ఆరాధ”