నా కాపారి నా ఊపిరి
155
పల్లవి: నా కాపారి నా ఊపిరి- నీవె నా యేసయ్యా (2)
నీవులేకుండా ఒక క్షణము (2)
బ్రతుక లేనయ్యా - నా యేసయ్యా “నా కాపారి”
1 తల్లి నన్ను మరచినను - మరువని దేవుడవు నీవెనయ్యా
నీ ప్రేమ నేనేల మరతునయ్యా (2)
నీ కృపను నేనేల విడతునయ్యా
నీ నీతి మార్గములో నడపుమయ్యా
నీ పరలోక ప్రార్ధన నేర్పుమయ్యా (2) “నా కాపారి”
2 పాపినైన నన్ను పిలిచి - మార్చిన దేవుడవు నీవేనయ్యా
నీ ప్రేమ నేనేల మరతునయ్యా
నీ కృపను నేనేల విడతునయ్యా
నీ నీతిమార్గములో నడపుమయ్యా
నీ పరలోక ప్రార్ధన నేర్పుమయ్యా (2) “నా కాపారి”