నడిపించు నా నావ
125
పల్లవి: నడిపించు నా నావ - నడి సంద్రమున దేవానవ జీవన మార్గమున - నా జన్మతరింప
1 నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబుయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవలో జేకొనుము “నడిపించు”
2 రాత్రంతయు శ్రమపడినా- రాలేదు ప్రభూజయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షంచు నీ సిలువ - రమణీయ లోతులలో
తనాలు వెదుకుటలో రాజిల్లు నా పడవ “నడిపించు”
3 ఆత్మార్పణ జెయకయే - ఆశించితి నీ చెల్లిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కల్లిమి
ఆశా నిరాశాయే – ఆవేదన ఎదురాయే
ఆధ్యాత్మిక లేమిగని – అల్లాడెను వల్లలు “నడిపించు”
4 ప్రభు మార్గము విడిసితిని - ప్రార్ధంచుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్దము మరచితిని
ప్రపంచ నటనలలో- ప్రావీణ్యమునునొంది
బలహీనుడనై యిపుడు - పాటింతును నీ మాట “నడిపించు”