మనిషి జన్మకే విలువ తెలియక
109
పల్లవి: మనిషి జన్మకే విలువ తెలియకఆత్మహత్య చేసుకొనె ఈ లోకం
బ్రతుకులో సుఖం దొరకలేదనీ
మరణమే ముంగిపనుకొనె ఈ లోకం
జంతువులకు లేదీ మనసు
బ్రతుకెందుకొ వాటికి తెలుసు
నీ కొరకే బలియౌవ్వాలనీ
మనిషినికి మరణం ముగింపుకాదని తెలుసా
అత్మకే చావులేదనీ – నీకు తెలుసా? (2) “మనిషి”
1 దేవుని అత్మను కలిగిన మనిషివి నీవే
ఆది అంతము లేని ఆత్మయేన్నది నీకే
ఆ దేవుడే నీ కిచ్చెను – తనలోని భాగాన్ని పంచెను
తన కోసమే బ్రతుకు తావనీ నినునమ్మి ఈ బ్రతుకు ఇచ్చెను
బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా?“మనిషి”
ఆత్మలేని ఏ దేహమైన – అది శవమే
అ త్ముంటేనే అందరికీ అది అవసరమే
నీ మరణదినము రాసాడనీ
ఆదినము వరకు బ్రతుకాలనీ
తన ఆశ తీర్చి వస్తావని
తన కొరకు చెబుతావు నీవని
బ్రతుకిచ్చిన ఆ దేవుని నువు మరుచుటే న్యాయమా? “మనిషి”
2 ఇస్కరి యోతు యూదా చేసిన ఘోరం
తనకు తాను ఉరిపెట్టు కొనుటయే చేసిన నేరం
చేసాడు అతడు అన్యాయము
చేరింది ఆత్మ పాతాళము
కాలాలి ఆత్మ కలకాలము
తన ఆత్మకే లేదు మరణము
మనిషి చేసిన నేరానికి శిక్షించుటే న్యాయమా
ఇది దేవునికి న్యాయమే“మనిషి”