నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం
107
పల్లవి: నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురంఎనలేని ఈ పాపికి అతి మోక్ష మార్గం (2)
యెహోవ దేవా నా యేసు ప్రభువా
నా కేడెము నా శైలము నీవే కదా(2)
1 తోడు నీడ లేని నన్ను చూడ వచ్చినావు
నా అండ కొండగ నీవు నిల్చిచావు (2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నను నీ సుతునిగా చేసుకొన్నావు
నా యేసయ్యా నీకే నా స్తుతి గీతము (2) “నీ ప్రేమ”
2 నా అపజయమందే నాకు జయమిచ్చతివి
బలహీనిడైన నన్ను బల్ల పరిచితివి(2)
అత్మతో నింపి శక్తితో నింపి
స్ధిరునిగా చేసి నన్ను బల పరిచితివి (2)
నా బలము నా జయము నీవే కదా (2) “నీ ప్రేమ”