నువ్వస్తావని మా కున్నది ఆశ!
57
పల్లవి: నువ్వస్తావని మా కున్నది ఆశ!
నిండి ఉండే నిదే క్షణ మా ప్రతి శ్వాస “త్వరలో” “నువ్వ”
1 విషము తాకిన గాలి నాలుకలన్ని చాచి
అవళ్ళింప చూస్తుంది ప్రాణ కోటిని
కాలుష్యములో చేరి నీరు చేదుగా మారి
హరియించి వేస్తుంది మానవాళిని
నీ వైపే మా అడుగు నీలోనే మా బ్రతుకు
ఇలలోన మా పరుగు మంటినుండి విడుదలకు “త్వరలో” “నువ్వ”
2 నీవు లేని మనిషి స్వార్ధపౌరుడై పోయే
హాని చేయుచున్నాడు సాటి వానికి
లాభమునకై వగిచి మమత మరిచే పోయే
పరుగు తీయుచున్నాడు నాశనానికి “నీవైపే “త్వరలో” “నువ్వ” (2)