తల్లినితండ్రిని అన్నాచెల్లిని నీ కోసం
24
పల్లవి: తల్లినితండ్రిని అన్నాచెల్లిని నీ కోసం ఆదేవుడే ఇచ్చాడు-చూశావా?
తల్లిగ తండ్రిగ అన్నగా చెల్లిగ ప్రేమను పంచాలనే ఇచ్చడు-ఇది తెలుసా?
తల్లిలో ప్రేమను ఉంచాడు - అది తల్లిది కాదు అన్ని
తండ్రిలో ప్రేమను ఉంచాడు
తల్లి తండ్రి అన్నాచెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే
ప్రేమను చూపాడు ఇలా - అది చెప్పకపోతే ఎలా?
ప్రేమను చూపాడు ఇలా - అది చెప్పకపోతే ఎలా? “తల్లిని”
1 సృష్టినే కలిగించాడు - ఆహారం వడ్డించాడు
తల్లిలాగ మూతపెట్టి - ఆహారం దాచాడు(2)
ఎండ నీకు తగులకుండా - మేఘమే ఇచ్చాడు
నీవు నిదురపోవాలనే-రాత్రినే ఇచ్చాడు
ఇంత మంచి దేవుని తెలుసుకున్నావా?
తన ప్రేమనే చూపినా నీ ప్రేమ చూపించవా (2)
ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా? “తల్లిని”
2 అమ్మ ప్రేమ నీ కిచ్చాడు అమ్మ అని పిలిపించాడు
తల్లి తండ్రి ప్రేమను పొందమనే ఇచ్చాడు (2)
తల్లి తండ్రి ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా?
బంధువులను ప్రేమించి నీవు దేవుడినే విడిచావా?
ఇంత మంచి దేవుని మరచిపోయావా?
ఏ తల్లి తండ్రి నేర్పిచెనా-ఏ బడిలోని ఇది చెప్పెనా? (2)
ప్రేమను చూపాడు ఇలా-అది చెప్పకపోతే ఎలా? “తల్లిని”