తరతరముల నుండి నివాస స్ధలము నీవే
22
పల్లవి: తరతరముల నుండి నివాస స్ధలము నీవే మాకు దేవా
భూమిలోకము పుట్టకముందే తండ్రిగా ఉన్న దేవా
జనన మరణము లేదు నీకే-అది అంతము లేదు నీకే
భూమి లోకములు పుట్టకముందే నీలో ఉన్నాము
మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు
నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు నీవు
చావే వరమని నిను చూసే భాగ్యమని
నీ సేవలో చావే వరము మాకే
తెలుసుకో మానవా-నీ తండ్రినే చేరుకోవా“తరతరముల”
1 మరణమే ఎదురైనా-ఏరూపంలో అది ఉన్నా
నీ మరణదినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే(2)
తన భక్తుల మరణమే గొప్పదని
తన దృష్టికే విలువగలదని
మరణం చూడక బ్రతికే నరుడే లేడని..
తెలుసుకో మానవా- నీ తండ్రిని చేరుకోవా (2) “తరతరముల”
2 ఎందరో భక్తులున్నా-పరదైసుకే చేరుకున్నా
పరలోకమందరం కలిసి రావాలనే రాశాడా దేవుడు
ఎందరో భక్తులున్నా-పరదైసుకే చేరుకున్నా
పరలోకమందరం కలిసి రావాలనే ఉంచాడాదేవుడు
ఈ లోకమే మనకు యాత్రని-పరలోకమే మన నివాసమని
దేవుని పని చేస్తే మరణం విశ్రాంతని… తెలుసుకో మానవా
నీ తండ్రినే చేరుకోవా-తెలుసుకో మానవా
తండ్రి ఆశ నీవు తీర్చి పోవా “తరతరముల”