పువ్వుకింత పరిమళమా
7
పల్లవి: పువ్వుకింత పరిమళమా - ఒక రోజుకింత అందమా?
పూస్తున్నది ఉదయాన్నే - రాలిపోతున్నదీ త్వరలోనే (2)
1 ఓ చిన్నపువ్వు తన జీవితంలో పరిమళాన్ని యిస్తుందయా (2)
ఆ పువ్వు కంటే మరి గోప్పగా - చేసిన నీలో ఆ పరిమళముందా? (2) “పువ్వు”
2 ఒక నాడు యేసు మన పాపములకై - పరిమళాన్ని వెదజల్లెనూ (2)
ఆ యేసు మరణం నీ కోసమేనని ఇక్కనైనా గమనించవా (2) “పువ్వు”
3 అతిచిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్శించెను (2)
బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా(2) “పువ్వు”