దేవుని స్తుతియించుడి
6
పల్లవి: దేవుని స్తుతియించుడి ఎల్లప్పడు దేవుని స్తుతించుడి…ఆ… (2)1 ఆయన పరిశుద్ద ఆలయమందు ఆయన సన్నిదిలో
ఆ…ఆయన సన్నిదిలో - ఎల్లప్పడు “దేవుని స్తుతి”
2 ఆయన బలమును ప్రసిధ్ధి చేయు – ఆకాశ విశాలమందు
ఆ…ఆకాశవిశాలమందు ఎల్లప్పడు “దేవుని స్తుతి”
3 ఆయన పరాక్రమ కార్యముబాట్టి - ఆయనప్రభవమును
ఆ…అయన ప్రభవమును ఎల్లప్పడు “దేవుని స్తుతి”
4 బూర ధ్వనితో ఆయనను స్తుతించుడి - స్వరమండలములతో
ఆ…స్వరమండలములతో - ఎల్లప్పడు“దేవుని స్తుతి”
5 సన్నాతంతుల సితారతోను – చక్కని స్వరములతో
ఆ…చక్కని స్వరములతో ఎల్లప్పడు “దేవుని స్తుతి”
6 తంబురతోను నాట్యముతోను - తంతివాయిద్యములతో
ఆ…తంతి వాయిద్యములతో - ఎల్లప్పడు“దేవుని స్తుతి”
7 సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్
ఆ…హల్లెలూయా ఆమెన్ - ఎల్లప్పడు “దేవుని స్తుతి”