మానవుడా కారణజన్ముడా?
4
పల్లవి: మానవుడా కారణ జన్ముడా? నీ జన్మకు కారణముంది (2)
అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు (2)
పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని (2) “మానవుడా”
1 పువ్వులెందుకు? కాయలెందుకు?
ఋతువులెందుకు? కాలాలెందుకు (2)
ఉన్నవన్ని నీ కోసమేనని - నీవు దేవుని కోసమేనని (2)
గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో (2)
నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ “మానవుడా”
2 సూర్యుడెందుకు? చంద్రుడెందుకు?
రాత్రులెందుకు? పగలు ఎందుకు? (2)
రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆ దేవుని పని నీవు చేయాలని (2)
ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి
పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ “మానవుడా”