బోయజు రూతుఙ్ పెన్లి ఆజినాన్
4
1 బోయజు, పట్నమ్‍ది దార్‍బందమ్‍దు సొహాండ్రె బాన్ మని సద్రుదు బస్తి మహిఙ్ బోయజు రూతుఙ్ వెహ్తిమహి డగ్రుహి కుండమండి తినికాన్, అయా గోర్జె సరిదాన్ వాజి మహిఙ్, అయావలె బోయజు వన్నిఙ్, “ఓ బయి ఇతల్ మర్‍జి వాజి ఇబ్బె బస్అ”, ఇజి వన్నిఙ్ కూక్తాన్. వాండ్రు మర్‍జి వాతాండ్రె బస్తాన్. 2 బోయజు ఆ నాటొణి పెద్దెల్‍ఙ లొఇ పది మందిదిఙ్ కూడ్ఃప్తాండ్రె ఇబ్బె బస్తు ఇజి వెహ్తిఙ్, వారుబా అబ్బె బస్తార్. 3 మరి వాండ్రు డగ్రుహి కుండమండి తిని వన్నిఙ్, “మోయాబు దేసెమ్‍దాన్ మర్‍జి వాతి నయోమి, మా కుటుమ్‍దికాన్ ఆతి ఎలీమెలెకుఙ్ మహి వంతుది బూమి సెగం పొర్‍సినాద్. అందెఙె నీను నెస్నిలెకెండ్ నాను యా మాట నిఙి వెహ్తెఙ్ ఇజి ఒడిఃబిత. 4 ఇబ్బె బస్తి మని వరి ఎద్రు నా లోకుర్ పెద్దెల్‍ఙ ఎద్రు నాను వెహ్సిన నీను అయా బూమి కొడ్ఃఅ. నీను తిన ఇహిఙ తిన్అ. తిండ్రెఙ్ అట్ఇతిఙ నఙి అర్దం ఆని లెకెండ నీను వెహ్అ. నీను ఆఎండ దన్నిఙ్ తిండ్రెఙ్ అక్కు మనికాన్ మరి ఎయెన్‍బ సిల్లెన్. నానె మన. 5 నీను నయోమిబాణిఙ్ ఆ మడిఃఙ్ కొటిఙ, నాండిహాన్‍నె యా సాతి వన్ని ఆడ్సి ఇల్లు మట్ని. ఇహిఙ సాతి వన్ని ఆడ్సి ఆతి మోయాబు దేసెమ్‍దాన్ వాతి రూతుఙ్ కాలు మట్ని”, ఇజి బోయజు వెహ్తాన్.6 అయావలె వాండ్రు, “అయా కుండమండి తిండ్రెఙ్ నాను కెఎ. ఎందన్నిఙ్ ఇహిఙ నఙి మని ఆస్తి సొన్‍పె ఆనాసు. నాను దన్నిఙ్ కెఎ. అందెఙె నీను నా వందిఙ్ కుండమండి తిని అక్కు మనికి ఆఅ”, ఇజి వెహ్తాన్.
7 ఇస్రాయేలు లోకుర్ లొఇ పూర్బమ్‍దాన్ అసి కుండమండి తిని దన్ని వందిఙ్‍నో, పొర్ని వందిఙ్‍నో పర్మణం కిని ఉండ్రి ఆసారం మనాద్ ఇజి తోరిస్ని వందిఙ్ ఒరెన్ వన్ని జోడ్కు కుత్‌సి మరి ఒరెన్ వన్నిఙ్ సీనార్. యా లెకెండ్ కిజినె పూర్తి అక్కు దొహ్‍క్తాద్ ఇజి ఇస్రాయేలు లోకుర్ గుర్తు కినార్. 8 అందెఙె యా డగ్రుహి అయా కుండమండి తినికాన్, “నీను దన్నిఙ్ కొడ్ఃఅ”, ఇజి బోయజుఙ్ వెహ్సి వన్ని జోడ్కు కుత్‌తి మహిఙ్,
11 అందెఙె బెత్లెహేము నాటొణి గవ్‍ని డగ్రు మని సద్రుదు బస్తి మహి లోకుర్‍ని పెద్దెల్‍ఙు విజెరె, “మాపు సాస్సిర్‍ఙు. నీ ఇండ్రొ వాతి యా బోదెల్‍దిఙ్, రాహేలుని లేయా ఇస్రాయేలు కుటుం నండొండార్ ఆని లెకెండ్, కొడొఃర్ ఇట్తి లెకెండ్ దిన్నిఙ్ యెహోవ సాయం కిపిన్. 12 నీను ఎప్రాతాదు విజు కలిగితి లెకెండ్ నండొ ఆజి మన్అ. బెత్లెహేముదు పల్కుబడిః మని వన్నిలెకెండ్ మన్అ. యెహోవ దయదాన్ నిఙి యా బోదెలి పొటాద్ పుట్తి కొడొఃర్ పెరెసు కుటుం మని లెకెండ నండొండార్ ఆపిర్. తామారు యూదాదిఙ్ ఇట్తి పెరెసు కుటుం లెకెండ్ ఆపిర్”, ఇజి వెహ్తార్.
బోయాజు తెగ్గదికార్
13 అందెఙె బోయజు రూతుఙు పెన్లి ఆజి దన్నిఙ్ కూడిఃతివలె యెహోవ దేవుణు పాతడిఃస్ని లెకెండ్ సాయం కితాన్, అది కొడొః కాస్తాద్. 14 అయావలె ఆ నాటొణి బోదెక్ నయోమిఙ్, “నిఙి సుడ్ఃదెఙ్ నేండ్రు నాతి సితి యెహోవ దేవుణు పొగిడెః ఆపిన్. ఇస్రాయేలు లోకుర్‍బాన్ పేరు మనిద్. 15 ఏడుగురు మరిసిరిఙ్ ఇంక ఒదె నిఙి ప్రేమిస్తి నీ కొడిఃయా నీ వందిఙ్ నండొ నెగ్గికెఙ్ కితాద్. అదినె విన్నిఙ్ కాస్తాద్”, ఇజి వెహ్తె. 16 అయావలె నయోమి ఆ బయిఙ్ తసి ఒడిః కిత అస్తాదె వన్నిఙ్ డొక్రి బీబీ ఆతాద్. 17 అయావలె దన్ని పడఃకాది బోదెకు, “నయోమి వందిఙ్ ఒరెన్ కొడొః పుట్తాన్”, ఇజి వెహ్సి వన్నిఙ్ ఓబెదు ఇజి పేరు ఇట్తె. వీండ్రె దావీదుదిఙ్ బుబ్బ ఆతి యెస్సయి అపొసి.
బోయజుని రూతు కుటుం వందిఙ్ వెహ్సినిక