రూతు
నెల్వకిబిస్నిక
యా పుస్తకమ్‍దు ఉండ్రి ఇస్రాయేలు కుటుం వందిఙ్ వెహ్సినాద్. ఇస్రాయేలు దేసెమ్‍దు కరు వాతిఙ్ ఎలీమెలెకు ఇన్ని వన్ని కుటుమ్‍దికార్, ఇస్రాయేలుదాన్ మోయాబు దేసెమ్‍దు బత్కిదెఙ్ సొహార్. అబ్బె బత్కిజి మహివలె, ఎలీమెలెకు సాతాన్. నయోమి దన్ని రిఎర్ మరిసిర్ రూతుఙ్‍ని ఓర్పా ఇని రుండి వన్కాఙ్ పెన్లి ఆతారె బత్కిజి మహార్. గాని వన్కా మాసిర్‍బ సాతార్. అయావెన్కా బెత్లెహేమ్‍దు మర్‍జి వాదెఙ్ ఇజి నయోమి ఒడిఃబితాద్. నయోమి దన్ని రుండి కొడిఃయెసిక్ వెట మోయాబుదునె మంజి ఎయెఙ్‍బ మరి పెన్లి ఆజి బత్కిదు ఇజి వెహ్తాద్. గాని రూతు కెఎతాద్, నయోమి వెటనె బెత్లెహేమ్‍దు మర్‍జి వాతాద్. అబ్బె అది వరి కుండమండి తినికాన్ ఆతి బోయజుఙ్ పెన్లి ఆతాద్.
మోసే సితి రూలు వజ మోయాబుదికార్ ఇస్రాయేలు జాతిదు కూడ్ఃదెఙ్ ఆఎద్. గాని రూతు దేవుణు ముస్కు పూర్తి నమకం ఇట్తిఙ్ ఇస్రాయేలు లోకుర్ వెట కూడ్ఃదెఙ్ సరి సితార్ ఇజి యా పుస్తకమ్‍దు వెహ్సినాద్. సేన కాలం సొహి వెన్కా ఇస్రాయేలు లోకుర్ నడిఃమి యా కుటుమ్‍దికార్ గొప్ప పెరికార్ ఆతార్. ఎందన్నిఙ్ ఇహిఙ, రూతుఙ్ నాతిసిర్ లొఇ ఒరెన్‍నె దావీదు రాజు, దావీదు తెగ్గదునె యేసు ప్రబు పుట్తాన్.
సఙతిఙ్ తోరిసినిక
రూతు మోయాబు దేసెం డిఃసి, బెత్లెహేముదు మర్‍జి వాతిక 1:1-22
ఇస్రాయేలు దేసెమ్‍దు రూతు బత్కిజినిక2:1--4:22