ద్వితీయ ఉపదేస కాండం
నెల్వ కిబిస్నిక
యూదుర్ యా పుస్తకమ్‍దిఙ్ ఉండ్రి వాకియమ్‍దు మని లెకెండ్ యాకెఙ్ మాటెఙ్ సిల్లిఙ వహి మాటెఙ్ ఇజి కూక్సి మహార్‍. యా పుస్తకమ్‍దు సీనాయి గొరొన్‍ ముస్కు ఇస్రాయేలు లోకురిఙ్ యెహోవ సితి ఆడ్రెఙ్, రూలుఙ్, ఒపుమానమ్‍కు నిల్‍ని వందిఙ్, వరిఙ్ సితి అతికారమ్‍కు, బాజిత వందిఙ్ రాస్త మనాద్. ముకెలం దేవుణుదిఙ్‍ని వరిఙ్ నడిఃమి మని ప్రేమ వందిఙ్ వెహ్సినాద్.
ఇస్రాయేలు లోకుర్ దేవుణు ఆఇ వన్కాఙ్ మాడిఃసి తప్సి సొన్సి మహిక దేవుణు సుడ్ఃతాండ్రె వరిఙ్ జాగర్తెఙ్ వెహ్సి దేవుణు ఆఇ వన్కా దరిఙ్ మీరు సొనిక ఆఎద్. వన్కాఙ్ దూరం మండ్రు ఇజి డట్టిసి వెహ్సినాన్. మరి ముకెలం ఇస్రాయేలు లోకుర్‍ పర్మణం కితి దేసెమ్‍దు సొని ముఙల, అయా దేసెమ్‍దు జాగర్త మండ్రెఙ్ వలె ఇజి మోసే వరివెట వర్గిజినాన్.