పది మంది యోసేపు అన్నసిర్ కూలిఙ్ కొండెఙ్ సొన్సిక
42
1 నస్తివలె అయ్‍గుప్తు దేసెమ్‍దు కూలిఙ్ మనె ఇజి యాకోబు వెహాండ్రె, “మీరు ఎందన్నిఙ్ ఒరెన్ వన్ని మొకొంa ఒరెన్ సుడెః ఆజినిదెర్?” ఇజి వన్ని మరిసిరిఙ్ వెహ్తాన్. 2 మరి వాండ్రు, “సుడ్ఃదు, అయ్‍గుప్తుదు కూలిఙ్ మనె ఇజి నాను వెహా. మాటు సాఎండ బత్కిజి మండ్రెఙ్ ఇహిఙ మీరు అబ్బె సొన్సి మా వందిఙ్ కూలిఙ్ కొడ్ఃజి తగాట్”, ఇజి వెహ్తాన్. 3 యోసేపు పది మంది అన్నసిర్ కూలిఙ్ కొడ్ఃజి తతెఙ్ అయ్‍గుప్తుదు సొహార్. 4 గాని యాకోబు, ఇనికబా ఆని కలిగినాద్‍సు ఇజి ఒల్‍బిజి వన్ని అన్నసిర్ వెట యోసేపు తంబెర్‍సి ఆతి బెనియమినుఙ్ పోకిస్ఎతాన్. 5 అయా లెకెండ్ కనాను దేసెమ్‍దు కరు లావు మహాద్. అందెఙె కూలిఙ్ కొండెఙ్ సొహి వరివెట ఇస్రాయేలు మరిసిర్‍బ సొహార్.
6 అయావలె యోసేపు అయ్‍గుప్తు దేసెం ముస్కు అతికారి ఆత మహాన్. వాండ్రు అయా దేసెమ్‍ది లోకురిఙ్ విజెరిఙ్ కూలిఙ్ పొర్నికాన్. అందెఙె యోసేపు అన్నసిర్ వాజి బూమిదు పడ్ఃగ్జి వన్నిఙ్ మాడిఃస్తార్. 7 యోసేపు వన్ని అన్నసిరిఙ్‌ సుడ్ఃతి వెటనె నా దాదర్ ఇజి నెస్తాండ్రె పయి వన్ని లెకెండ్ వరివెట, మీరు ఎమేణిఙ్ వాతిదెర్ ఇజి గస్రిజి వెహ్తాన్. అందెఙె వారు, “కనాను దేసెమ్‍దాన్ తిండి కొండెఙ్ వాతాప్”, ఇజి వెహ్తార్. 8 యోసేపు వన్ని దాత్సిరిఙ్ పోలిస్తాన్. గాని వారు వన్నిఙ్ పోలిస్తెఙ్ అట్ఎతార్. 9 యోసేపు, వరి వందిఙ్ గాస్తి కల్లెఙ గుర్తు కితాండ్రె, “మీరు గుట్టుబాటు లాగ్‌దెఙ్ వాతిదెర్. మా దేసెమ్‍దు ఎమేణి సరిదాన్ వాజి ఉద్దం కిజి గెల్‍స్తెఙ్ ఇజి సుడ్ఃదెఙ్ వాతిదెర్”, ఇజి వెహ్తాన్. 10 అందెఙె వారు, “సిల్లె బాబు, నీ పణిమన్సి ఆతి మాపు తిండి కొడ్ఃజి ఒతెఙ్‍నె వాతాప్. 11 మాపు విజెపె ఒరెన్ వన్ని పొట్టద్‍కాప్. నీతి నిజాయితిదికాప్. గుట్టు లాగ్నికాప్ ఆఎప్”, ఇజి వన్నివెట వెహ్తార్. 12 గాని వాండ్రు, “సిల్లె, యా దేసెం గుట్టుబాటు నెస్తెఙ్ వాతిదెర్”, ఇజి వరిఙ్ వెహ్తాన్. 13 అందెఙె వారు, “నీ పణిమన్సి ఆతి మాపు పన్నెండు మంది అన్నదముల్‍ఙు మనాప్. మా బుబ్బ ఒరెండ్రె. మఙి విజెరిఙ్ వీస్‍కొడః కనాను దేసెమ్‍దు మా బుబ్బ డగ్రు మనాన్. ఒరెన్ సిల్లెన్”, ఇజి వెహ్తార్. 14 అహిఙ యోసేపు, “మీరు గుట్టుబాటు లాగ్నికిదెర్ ఇజి నాను వెహ్తి మాట నిజమే. 15 నాను పరో రాజు అతికారమ్‍దాన్ ఒట్టు పొక్సిన, మీ తంబెరిఙ్ ఇబ్బెన్ కూక్సి తతిఙానె గాని సిల్లిఙ ఇబ్బెణిఙ్ మీరు సొండ్రెఙ్ ఆఎద్. 16 మీ తంబెరిఙ్ కూక్సి తతెఙ్ మీ లొఇ ఒరెన్ వన్నిఙ్ పోక్తు. మహికిదెర్ జేలిదు మండ్రు. మీ బాన్ నిజం మనాదొ సిల్లెనొ మీ మాటెఙణిఙ్ నెస్తెఙ్ ఆనాద్. సిల్లిఙ పరో రాజు అతికారమ్‍దాన్ ఒట్టు పొక్సిన. మీరు గుట్టు లాగ్నికిదెరె”, ఇజి వెహ్తాన్. 17 విజెరిఙ్ మూండ్రి దినమ్‍కు జేలిదు ఇట్తాన్.
18 మూండ్రి దినమ్‍దు యోసేపు వరిఙ్ సుడ్ఃజి, “నాను దేవుణుదిఙ్ తియెల్ ఆనికాన్. అందెఙె మీరు పాణమ్‍దాన్ మండ్రెఙ్ ఇహిఙ నాను వెహ్నిలెకెండ్ కిదు. 19 మీరు నీతి నిజాయితి మనికిదెర్ ఇహిఙ మీ అన్నదముల్‍ఙ లొఇ ఒరెన్ జేలిదు మండ్రెఙ్ వలె. మహికిదెర్ సొన్సి మీ కుటుమ్‍ది వరిఙ్ కరుదాన్ కాపాడ్ఃదెఙ్ కూలిఙ్ ఒతు. 20 గాని మీ తంబెరిఙ్ నా డగ్రు కూక్సి తతెఙ్ వలె. నస్తివలె మీరు వెహ్తి మాటెఙ్ నిజం ఇజి రుజువ్ ఆనాద్. మీరు సాఎండ బత్కినిదెర్”, ఇజి వెహ్తిఙ్ వారు అయా లెకెండ్ కితార్. 21 అయావలె వారు, “నిజమ్‍నె మా తంబెరి ముస్కు మాటు తపు కితి వందిఙ్ యా సిక్స మఙి వాజినాద్. మా తంబెరి మఙి దయ కిదు ఇజి అడఃబాతిఙ్‍బ మాటు వన్ని బాదదిఙ్ సుడ్ఃజిబ వెన్ఎతాట్. అందెఙె యా సిక్స మఙి వాతాద్”, ఇజి ఒరెన్ వెట ఒరెన్ వర్గితార్. 22 అయావలె రూబేను, “యా బయిఙ్ బాద కిమాట్ ఇజి నాను మిఙి వెహ్తా. గాని మీరు వెన్ఇతిదెర్. అందెఙె వన్నిఙ్ కితి తపు మా ముస్కు వాత మనాద్”, ఇజి వరివెట వెహ్తాన్. 23 యోసేపు వరి అన్నర్ వెట వర్గిదెఙ్ వరి బాస నెస్ని ఒరెన్ వన్నిఙ్ వరివెట వర్గిస్తాన్. వారు వర్గిని మాటెఙ్ యోసేపుఙ్ అర్దం ఆఎద్ ఇజి అనుకొటార్. గాని వారు వెహ్తి మాటెఙ్ విజు వెంజి యోసేపు అర్దం కితాన్. 24 వాండ్రు వరి బాణిఙ్ పడ్ఃకాద్ సొహా అడఃబతాండ్రె, మరి వరి డగ్రు వాజి వర్గిజి, సిమియొనుఙ్ వరి ఎద్రునె తొహ్సి ఒసి వన్నిఙ్ జేలిదు ఇట్తాన్.
25 నస్తివలె యోసేపు వన్ని పణిమన్సిర్ వెట, “వరి బస్తెఙ కూలిఙ్ నిహ్‍తు, ఎయె వెండి రూపాయ్‍ఙు వరి బస్తెఙ లొఇనె నిహ్సి ఇడ్‍దు. వారు సొనివలె సర్దు ఉండెఙ్ వరిఙ్ సరి ఆని నసొ తిండి రొస్తు”, ఇజి ఆడ్ర సితాన్. 26 వారు కొటి కూలిఙ్ వరి గాడ్ఃదెఙ ముస్కు ఎకిసి బాణిఙ్ సొహార్. 27 అయావలె వారు రోమ్‍దెఙ్ బస్తార్. నస్తివలె ఒరెన్, వన్ని గాడ్ఃదెదిఙ్ మేత సీదెఙ్ బస్త డిప్సి కుత్తివలె, వన్ని వెండి రూపాయ్‍ఙు వన్ని బస్త లొఇ తోరితె. 28 అయావలె వాండ్రు, “నా వెండి రూపాయ్‍ఙు మహ్తా సిత మనార్. ఇదిలో యాకెఙ్ నా బస్త మూటాద్ మనె”, ఇజి వరిఙ్ వెహ్తాన్. వారు నండొ తియెల్ ఆజి, “యాక ఇనిక? దేవుణు ఎందన్నిఙ్ యాలెకెండ్ కితాన్‍?” ఇజి వర్గితార్.
అయ్‍గుప్తుదు జర్గితిక అపొసి వెట వెహ్సినిక
29 అయావెన్కా వారు కనాను దేసెమ్‍దు మని వరి బుబ్బ ఆతి యాకోబు డగ్రు వాజి వరిఙ్ జర్గితిక విజు అపొసిఙ్ వెహ్తార్. 30 అక్క ఇనిక ఇహిఙ ఆ దేసెమ్‍ది అతికారి, మా వెట గస్రిజి వెహ్సి యా దేసెమ్‍దు గుటు లాగ్నికార్ వాతార్ ఇజి ఎత్తు కితాన్. 31 అయావలె, “మాపు నీతి నిజాయితి మనికాప్ గుట్టు లాగ్నికాప్ ఆఎప్. 32 మాపు పన్నెండు మంది అన్నదముల్‍ఙు. మఙి బుబ్బ ఒరెండ్రె. మా తంబెరి ఒరెన్ సిల్లెన్. వీస్‍కొడఃదికాన్ కనాను దేసెమ్‍దు మా బుబ్బ డగ్రు మనాన్”, ఇజి వన్నివెట వెహ్తాప్. 33 అందెఙె ఆ దేసెమ్‍ది అతికారి మఙి సుడ్ఃజి, “మీరు నీతి నిజాయితి మనికిదెరొ సిల్లెనొ దిన్నిటాన్ నాను నెస్న. మీ అన్నదముల్‍ఙ లొఇ ఒరెన్ వన్నిఙ్, నా డగ్రు డిఃసి మీరు సొన్సి, మీ కుటుమ్‍ది వరిఙ్ కరుదాన్ కాపాడ్ఃదెఙ్ కూలిఙ్ ఒతు. 34 గాని నా డగ్రు మీ ఇజ్రి వీస్‍కొడఃదిఙ్ కూక్సి తగాట్. అయావలెనె మీరు నీతి నిజాయితి మనికిదెర్ ఆనిదెర్. గాని గుటు లాగ్నికిదెర్ ఆఇదెర్ ఇజి నాను నెస్న. నస్తివలె మీ తంబెరిఙ్ మిఙి ఒప్పజెప్నా. మరి మీరు యా దేసెమ్‍దు కూలిఙ్ కొడ్ఃజి ఒతెఙ్ సరి సీన”, ఇజి వెహ్తాన్. 35 వారు వరి బస్తెఙ్ వాక్తివలె ఎయె వెండి రూపాయ్‍ఙు మూటెఙ్ వరి బస్త లొఇనె మహె. మరిసిర్‍ని అపొసి ఆ డబ్బు మూటెఙ్ సుడ్ఃజి తియెల్ ఆతార్. 36 అయావలె వరి అపొసి ఆతి యాకోబు వరిఙ్ సుడ్ఃజి, “మీరు నఙి కొడొఃర్ సిల్లెండ కిజినిదెర్. యోసేపు సిల్లెన్. సిమియొను సిల్లెన్. బెనియమినుఙ్‍బ కూక్సి ఒతెఙ్ సుడ్ఃజినిదెర్. యా బాద విజు నా ముస్కునె వాతాద్”, ఇహాన్.
37 అందెఙె రూబేను, “నాను బెనియమినుఙ్ నీ డగ్రు మర్‍జి కూక్సి తెఇతిఙ, నా రిఎర్ కొడొఃరిఙ్ సప్అ. యెలు వన్నిఙ్ నావలె పోక్అ. మహ్సి తసి నీ కిదు ఒప్పజెప్ని బాజిత నాది”, ఇజి అపొసి వెట వెహ్తాన్. 38 గాని యాకోబు, “నా మరిన్‍దిఙ్ మీ వెట పోక్ఎ. వీండ్రె మిగ్లిత మనాన్. ఆహె వన్ని దాత్సి సాత సొహాన్. మీరు సొని సర్దు విన్నిఙ్‍బ ఆని జర్గితిఙ డొక్ర ఆతి నాను నండొ దుకం ఆజి సాని వజ కినిదెర్లె”, ఇజి వెహ్తాన్.