హోషేయ
గ్రంథకర్త
హోషేయ గ్రంథంలోని అనేక సందేశాలను పలికినది హోషేయ ప్రవక్త. వాటిని అతడే స్వయంగా రాశాడో లేదో తేలియదు. హోషేయ దేవుని పక్షంగా మాట్లాడాడని నమ్మిన అతని అనుచరులు బహుశా అతని ప్రవచనాలను గ్రంథస్దం చేసి ఉండవచ్చు. ఈ ప్రవక్త పేరుకు అర్ధం “రక్షణ.” మరి ఏ ఇతర ప్రవక్త కంటే కూడా హోషేయ తన ప్రవచనాలను తన వ్యక్తిగత జీవితంతో అను సంధానించాడు. తనకు నమ్మక ద్రోహం చేస్తుందని ముందుగానే ఎరిగి, అతడు ఒక స్త్రీని పెళ్ళి చేయసుకోవడం ద్వారా, ఇశ్రాయేలు మీద తీర్పులు వినిపించే పేర్లు తన పిల్లలకు పెట్టడం ద్వారా అతని ప్రవచన పరిచర్య అతని కుటుంబం లో నుంచే బయలు వెళ్ళింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 755 - 725
యెషయా సందేశాలను సేకరించి, ఎడిట్ చేసి, ప్రతులు ఎత్తిరాశారు. ఈ తతంగమంతా ఎప్పటికి పూర్తి అయిందో మనకు తెలియదు. అయితే యెరుషలేము వినాశానానికి ముందు ఇది పూర్తి అయిందన్నది మాత్రం స్పష్టం.
స్వీకర్త
హోషేయ మౌఖిక సందేశాత్మక హెచ్చరికలు, పశ్చాతాపానికి పిలుపుగా, పూర్వ క్షేమస్ధితి కలుగుతుందనే వాగ్దానంగా రాసి పెట్టడం జరిగింది.
ప్రయోజనం
దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడని ఇశ్రాయేలీయిలకు, మనకు కూడా గుర్తు చేయడానికి హోషేయ ఈ గ్రంథం రాశాడు. యోహోవాయే ఏకైక నిజ దేవుడు. నిర్ద్వంద్వమైన స్వామిభక్తి ఆయన కోరుతున్నాడుట. పాపం తీర్పును కొనితెస్తుంది. అలా కాకుంటే బాధాకరమైన పరిణామాలు, శత్రుదాడి, బానిసత్వం తప్పవు. నమ్మకంగా ఉంటామని శుష్కప్రియాలు పలికి, ఆ మాటలు మీరుతూ ఉండే మనుషుల్లాంటివాడు కాదు దేవుడు. ఇశ్రాయేలు నమ్మక ద్రోహం చేసినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉంటాడు. వారికి పూర్వక్షేమస్ధితి కలిగే మార్గం ఎర్పరుస్తూ ఉంటాడు. హోషేయ, గోమెరుల సంకేతరూపకమైన వివాహాల ద్వారా ఇశ్రాయేలు వంటి విగ్రహరాధక జాతి పట్ల దేవుని ప్రేమ, పాపం పట్ల తీర్పు, క్షమించే ప్రేమలను కనుపరిచే చక్కని ఉపమాలంకారంగా ఈ పుస్తకంలో రాసి ఉంది.
ముఖ్యాంశం
నమ్మకద్రోహం
విభాగాలు
1. హోషేయ కులట అయిన భార్య — 1:1-11
2. ఇశ్రాయేలు పట్ల దేవుని తీర్పులు, కక్షలు — 2:1-23
3. దేవుడు తన ప్రజలను విమోచిస్తాడు — 3:1-5
4. ఇశ్రాయేలు నమ్మకద్రోహం, శిక్ష — 4:1-10:15
5. దేవుని ప్రేమ, ఇశ్రాయేలుకు పూర్వక్షేమస్ధితి కలిగించడం — 11:1-14:9