2 రాజులు
గ్రంథకర్త
1, 2 రాజులు గ్రంథాలు ఆరంభంలో ఒకటే పుస్తకం. యూదు సంప్రదాయం ప్రకారం. 2 రాజులు రాసినది యిర్మీయా అయితే ఈ మధ్య కాలంలో బైబిలు వ్యాఖ్యాతలు ఈ గ్రంథాన్ని పేరు తేలియని ‘డ్యుటిరోనామిస్టులు’ అనే పండిత బృందం రాశారని అభిప్రాయ పడుతున్నారు. 2 రాజులు గ్రంథంలో ద్వితీయోపదేశ కాడంలోని ముఖ్యాంశం తాలూకు పోలికలు ఉన్నాయి. దేవుని పట్ల విధేయత దీవెనలు తెస్తుంది. అవిధేయత శాపాలు తెస్తుంది.
రచనా కాలం, ప్రదేశం
సూమారు క్రీ. పూ. 561 - 538
మొదటి ఆలయం ఇంకా నిలిచి ఉండగానే గ్రంథరచన జరిగింది (1 రాజులు 8:8).
స్వీకర్త
ఇశ్రాయేల్ జాతి, బైబిల్ పాఠకులందరూ.
ప్రయోజనం
2 రాజులు గ్రంథం మొదటి రాజులు గ్రంథానికి కొనసాగింపు. ఇది విభజిత రాజ్యాల (ఇశ్రాయేల్, యూదా) చరిత్ర కథనాన్ని కొనసాగిస్తున్నది. 2 వ రాజులు గ్రంథం ఇశ్రాయేల్, యూదా రాజ్యాల అంతిమ పరాజయం, ఇస్రాయేల్ రాజ్యం అష్హురుకు, యూదా రాజ్యం బబులోనుకు చెరలోకి పోవడంతో ముగుస్తుంది.
ముఖ్యాంశం
చెదిరిపోవడం.
విభాగాలు
1. ఏలీషా పరిచర్య — 1:1-8:29
2. ఆహాబు రాజవంశం అంతం — 9:1-11:21
3. యోవాషు పాలన నుండి ఇశ్రాయేల్ అంతం దాకా — 12:1-17:41
4. హిజ్కియా పాలన నుండి యూదా అంతం దాకా — 18:1-25:30