2 సమూయేలు
గ్రంథకర్త
ఇందులో గ్రంథకర్త పేరు కనిపించదు. సమూయేలు ప్రవక్త అప్పటికే చనిపోయాడు గనుక అతడు ఈ గ్రంథం రాసే అవకాశం లేదు. ఆరంభంలో రెండు సమూయేలు గ్రంథాలు ఒకటే పుస్తకం. సెప్టువజింటు అనువాదకులు దీన్నిరెండు పుస్తకాలుగా విడగొట్టారు. కాగా మొదటి గ్రంథం సౌలు మరణంతో ముగుస్తుండగా, రెండవది దావీదు పరిపాలనతో మొదలవుతున్నది. అంటే మొదట యూదా గోత్రానికి తరువాత ఇశ్రాయేల్ అంతటికీ అతడు రాజయ్యాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 1010 - 965
బహుశా బబులోను చెర కాలం లో రాసి ఉండవచ్చు.
స్వీకర్త
ఏదో ఒక రీతిలో ఈ పుస్తకాల ప్రథమ పాఠకులు దావీదు సొలొమోనుల పరిపాలన కాలంలో ఉన్న ఇశ్రాయేలీయుల.
ప్రయోజనం
2 సమూయేలు గ్రంథం దావీదు రాజు పరిపాలన వర్ణన. దావీదు నిబంధన ఈ పుస్తకంలో ఈ చారిత్రిక అంశంగా కనిపిస్తున్నది. దావీదు యోరుషలేమును రాజకీయ, మత కేంద్రంగా చేశాడు (2 సమూ 5:6-12; 6:1-17). యెహోవా మాటలు (2 సమూ 7:4-16), దావీదు మాటలు (2 సమూ 23:1-7) ఇది దేవదత్తమైన సామ్రాజ్యమనే సత్యాన్ని నొక్కి చెబుతున్నాయి. మెస్సీయ వెయ్యేళ్ళ రాజరికం ప్రవచనాత్మకంగా ఎత్తి చూపటం జరిగింది.
ముఖ్యాంశం
ఏకీకరణం
విభాగాలు
1. దావీదు రాజ్య ప్రభావం — 1:1-10:19
2. దావీదు రాజ్య అభ్యున్నతి — 11:1-20:26
3. అనుబంధం — 21:1-24:25