3 యోహాను లేఖ
1
1 ప్రియ సోదరుడైన గాయస్✽కు పెద్దనైన✽ నేను రాస్తున్న విషయాలు. నీవంటే నాకు నిజమైన✽ ప్రేమ ఉంది. 2 ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా✽ వర్ధిల్లుతూ ఉన్నట్టే ఆరోగ్యంగా ఉండి అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. 3 నీలో ఉన్న సత్యాన్ని గురించి, నీవు సత్యంలో✽ నడుచుకొంటున్నావని✽ కొందరు సోదరులు✽ వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు నాకెంతో ఆనందం✽ కలిగింది. 4 నా పిల్లలు✽ సత్యంలో నడుచుకొంటున్నారని వినడంకంటే నాకు మించిన ఆనందమేదీ లేదు.5 ప్రియ సోదరా, సోదరులకోసం✽, పరాయివారికోసం కూడా నీవు ఏమి చేస్తున్నావో అదంతా నమ్మకంగా✽ చేస్తూ ఉన్నావు. 6 వారు నీ ప్రేమ✽ను గురించి క్రీస్తు సంఘానికి సాక్ష్యం చెప్పారు. 7 ఇతర ప్రజల✽ దగ్గర ఏమీ పుచ్చుకోకుండా యేసు పేరు కోసం✽ బయలు దేరారు వారు. కనుక దేవునికి తగినట్టు✽ నీవు వారిని వారి ప్రయాణంలో సాగనంపితే✽ బాగుంటుంది. 8 మనం సత్యం విషయంలో భాగస్థులమయ్యేలా✽ అలాంటివారికి స్వీకరించాలి.
9 ✽అక్కడి సంఘానికి నేను రాశాను గానీ వారిలో ప్రముఖుడుగా ఉండడం అనేది ఎంతో ఇష్టమున్న దియొత్రెఫెస్ మా మాట అంగీకరించడం లేదు. 10 అందుచేత నేను అక్కడికి వస్తే అతడు చేసిన పనులు జ్ఞాపకం చేస్తాను. అతడు మా విషయం చెడ్డ మాటలతో వదరుతున్నాడు✽. అది చాలదన్నట్టు అతడు సోదరులను స్వీకరించడం లేదు, వారిని స్వీకరించాలనుకొనేవారిని కూడా అడ్డగించి సంఘంలోనుంచి వెలివేస్తున్నాడు✽.
11 ప్రియ సోదరులారా, మంచిని చూచి ఆ ప్రకారం✽ ప్రవర్తించండి, చెడుతనాన్ని కాదు. మంచి✽ చేసేవాడు✽ దేవునికి చెందేవాడు. చెడుతనం చేసేవాడు దేవుణ్ణి చూడనివాడే. 12 దేమేత్రియస్ గురించి అందరివల్లా – సత్యంవల్ల కూడా✽ – మంచి సాక్ష్యం ఉంది. మేము కూడా అతని గురించి సాక్ష్యం చెపుతున్నాం. మా సాక్ష్యం సత్యమని మీకు తెలుసు.
13 అనేక విషయాలు నీకు రాయవలసి ఉన్నా, సిరా, కలాలతో ఇవి రాయడం నాకిష్టం లేదు. 14 ✽త్వరలో నిన్ను చూడాలని నాకు ఆశాభావం ఉంది. అప్పుడు మనం ముఖాముఖిగా మాట్లాడుకొంటాం.
15 నీకు శాంతి ఉంటుంది గాక! మన స్నేహితులు నీకు అభివందనాలు చెపుతున్నారు. అక్కడి మిత్రులకు పేరు పేరున మా అభివందనాలు చెప్పు.