ముద్ర
6
1 ఏ గొర్రిడాలు, ఏ సాతగొట్ట సీలయఁటి, రొండని రిక్హటి, నాను హేరికియ్యలిఎ, ఏ సారిగొట్ట జీప్కటి రొండి, “వాము” ఇంజిఁ, గ్ణూహీఁనిలేఁతి గిఁయఁతొల్లె వెస్తని వెచ్చెఎఁ.
2 ఓడె నాను హేరికియ్యలిఎ, రో కుమ్‍డి గోడ, నంగొ చోంజ అయ్యతె. ఏదఅఁ లెక్కొ రొఒసి వెల్లు అస్సహఁ కుగ్గాఁచెసి. ఏవణకి రొ టోపెరి హీహఁచయి, ఏవసి గెల్హిఁ, ఓడె గెల్హలితక్కి పంగత హచ్చెసి.
3 ఏ గొర్రిడాలు, రీ సీలతి రిక్హటి, “వాము” ఇంజిఁ, రీ జీవు వెస్తని వెచ్చెఎఁ.
4 ఎచ్చెటిఎ ఎట్కతి, ఓరొ పఎరిపల్లగోడ హచ్చె, లోకు రొఒణితొల్లె రొఒసి పాయివి ఆనిలేఁకిఁ, బూమి లెక్కొ సాద హిల్లఅలేఁకిఁ కియ్యలితక్కి, ఏ గోడ లెక్కొ కుగ్గాఁచణకి హుక్కొమి హీతయి, ఓడె ఏవణకి, రొ కజ్జ *కండవ హీతయి.
5 ఏ గొర్రిడాలు, తీనిగొట్ట సీలతి రిక్హటి, “వాము” ఇంజిఁ, తీని జీవు వెస్తని వెచ్చెఎఁ. ఓడె నాను హేరికియ్యలిఎ, రో కాడియ గోడ నంగొ చోంజ అయ్యతె, ఏదని లెక్కొ రొఒసి కాట్వతి అస్సహఁ, కగ్గాఁచెసి.
6 ఇంజఁ, “రో దేనార కాసుతక్కి, పోడెక గోహొఁయఁ, రో దేనార కాసుతక్కి, తీని పోడి రాయ్యి, నియుఁతి, ద్రాక్సరస్సతి క్డాఎక కిఅదు”, ఇంజిఁ, ఏ సారిగొట్ట జీప్క మద్దిటి జోలితిలేఁకిఁ, రో గిఁయఁ నంగొ వేంగి వాతె.
7 ఏ గొర్రిడాలు, సారి సీలతి రిక్హటి, “వాము” ఇంజిఁ, సారి జీవు వెస్తని వెచ్చెఎఁ.
8 ఎచ్చెటిఎ నాను హేరికియ్యలిఎ, మహ్ణియఁ దరుఁబు వాణగట్టి, రో గోడ నంగొ చోంజ అయ్యతె. ఏదని లెక్కొ కుగ్గానణి దోరు, హాకి, హాతరి మన్ని టాయు ఏవణి జేచ్చొ మచ్చె, బూమిత బత్కీనరఇఁ, కండతొల్లె, కరువుతొల్లె, దుక్కతొల్లె, బూమి లెక్కొ మన్ని మూర్కొమిగట్టి, జొంతొయఁతొల్లె పాయలితక్కి, బూమితి సారి బాగటి, రో బాగ ముహెఁ, ఏవణకి హుక్కొమి హీహానయి.
9 ఏవసి, పాస సీలతి రిక్హటి, మహపురుకత్త పాయిఁ, తాంబు హీతి రుజువి పాయిఁ, టూణ్హరి జీప్కాణి, లొచ్చపిండ డోఇక మన్నని మెస్తెఎఁ.
10 ఏవరి, “బర్రె హుక్కొమి మన్ని, అస్సలతి వాణగట్టతి, నెహాఁతి, ఎచ్చె పత్తెక కాకులి కిఅన మంజి, బూమిత బత్కీనరఇఁ, మా కస్సతి పాయిఁ, ఎచ్చెక డొండొ కిఅన మంజి”, ఇంజిఁ, గట్టి కిల్లెడి కిత్తెరి.
11 ఏవరకి బర్రెతక్కి, కుమ్‍డి సొక్కయఁ హీహఁచయి, ఓడె ఏవరిలేఁకిఁఎ, హయ్యలితక్కి మన్ని, ఏవరితొల్లె కల్హితరి లెక్క, తయ్యియఁ లెక్క, పూర్తి ఆని పత్తెక, ఓడె కొచ్చె కాలొమి, కాచ్చమచ్చిదెఁ ఇంజిఁ, ఏవరఇఁ వెస్తయి.
12 ఏ గొర్రిడాలు, సోహొ సీలతి రిక్హటి, నాను హేరికియ్యలిఎ, హారెఎ బూమి వీడ్డితె. వేడ రొఒవలేఁ కాడియ ఆతె. లేంజు కస్స వాణ ఆహాచె.
13 కజ్జ గాలితక్కి వీడ్డీని, అంజురి మార్నుటి, డాయుతి పాడెయిక డుల్లినిలేఁకిఁ, హాగుతి హుక్కయఁ, బూమిత డుల్లితు.
14 ఇంజహఁ హాగుపాక, రూపితి పుస్తకొములెఁ ఆహఁ, తన్ని టాయుటి గుచ్చ ఆతె. హోర్క బర్రె, సమ్‍దురి మద్ది మన్ని మెట్టయఁ, తమ్మి తమ్మి టాంగటి పిట్టొవి ఆతు.
15 బూమి లెక్కొ మన్ని రజ్జయఁ, గవెరెమి మన్నరి, పట్హాలతక్కి కజ్జరి, సఙసారియఁ, హారెఎతి పాణగట్టరి, గొత్తియఁ బర్రెజాణ, సుకొమిగట్టరి బర్రెజాణ, హోర్కాణ, పావుఁణ, వల్లి కొర్గోఁణ డుగ్గహఁ,
16 “సింగసాణత కుగ్గానణి తాణటి, గొర్రిడాలుతి కోపటి, హారెఎతి డొండొ దిన్న వాతె, ఏదఅఁతి సాస కియ్యలి ఆడ్డినసి ఎంబఅసి?
17 హోర్కాణి, వల్కాణి, మీరు మమ్మఅఁ ప్డీక్హఁ, సింగసాణత కుగ్గానణకి, చోంజ ఆఅరేటు, గొర్రిడాలు కిహీఁజని డొండొటి, మమ్మఅఁ డుక్హదు”, ఇంజిఁ, వెస్సీనెరి.