బర్రెజాణతి బత్కుతి పాయిఁ ప్రాదన కిత్తిదెఁ
2
1 మారొ పూర్తి బక్తితొల్లె గవెరెమిగట్టతయి ఆహఁ, నిప్పదతొల్లె సుకెమినంగ బత్కీనిలేఁకిఁ ఆతిఆఅ కిహఁ ముక్లెమినంగ, లోకు బర్రెతి పాయిఁ,
2 రజ్జయఁ పాయిఁ, హుక్కొమిగట్టి బర్రెతి పాయిఁ, మానొవి కిహిఁ, ప్రాదన కిహిఁ, రీసిహిఁ, మహపురుఇఁ జొహొరి కిత్తిదెఁ ఇంజిఁ మిమ్మఅఁ వెస్సీఁజఇఁ.
3 ఈది నెహాఁయి, మమ్మఅఁ గెల్పని మహపురు ఇస్టొమి ఆతయి ఆహానె.
4 మణిసిఁయఁ బర్రెజాణ గెల్హహఁ, అస్సలతి పాయిఁ పుచ్చి బుద్దిగట్టరి ఆహఁ మచ్చిదెఁ ఇంజిఁ మహపురు ఒణిపీనెసి.
5 మహపురు రొఒసిఎ, మహపురుకిఎ లోకుతక్కిఎ మద్ది మంజహఁ సాద కిన్నసి రొఒసిఎ, ఏవసిఎ యేసుక్రీస్తు ఇన్ని మణిసి.
6 ఈవసి లోకూణి బర్రెజాణతి పిస్పి కిహఁ, మహపురుతొల్లె పొత్తుగట్టరఇఁ కియ్యలితక్కి, తన్ని జీవుతి దర్ర దొస్సహఁ హియ్యతెసి. ఈదఅఁ బాట సరి ఆతి కాలొమిత రుజువి వెస్సలి ఆనె.
7 ఈ రుజువి వెస్సలితక్కిఎ నన్నఅఁ వెహ్నణఇఁనంగ, అపొస్తులుడనంగ, నమ్మకొముతి అస్సలతి బాట యూదుయఁ ఆఅతరకి జాప్నణఇఁనంగ నిప్హాతెసి. నాను సత్తెఎ వెస్సీఁజఇఁ, బోఁకిఁజొఒఁ.
8 ఇంజెఎ బర్రె టాంగణ ఆబయఁరాసి, కోపవ, అస్పి ఆని వాద్నయఁ, ఒణుపువ హిల్లఅగట్టరి ఆహఁ, నీతిగట్టి కెస్క పెర్హఁ ప్రాదన కిత్తిదెఁ ఇంజిఁ వెస్సీఁజఇఁ.
9 ఓడె ఇయ్యస్కవ తణంగ మంజఁ సూదుగట్టఇ ఆహఁ గవెరెమి బెట్ట ఆనిలేఁకిఁ, ఒడ్డితి మణ్కిగట్టఇ ఆహ మంజహఁ, సరి ఆతిలేఁకిఁ హొంబొరిక హుచ్చహఁ మచ్చిదెఁ, గాని లోకు మెస్తపెరివ ఇంజిఁ బేణియఁతొల్లెవ, బఙరతొల్లెవ, ముత్తెముకతొల్లెవ, ఓడె హారెఎ దరగట్టి హొంబొరికతొల్లెవ సందెడి కిహకొడ్డఅన,
10 మహపురుకి బక్తిగట్టతొమి ఇంజిఁ వెస్సకొడ్డిని ఇయ్యస్కలేఁకిఁ, సరి ఆతి నెహిఁ కమ్మయఁతొల్లె తమ్‍గొ తాంబుఎ సందెడి కిహకొడ్డితిదెఁ.
11 ఇయ్యస్క హాడ్డఆఅన మంజహఁ, పూర్తినంగ లొఙహఁ జాపితిదెఁ.
12 ఇయ్య హాడ్డఆఅన మచ్చిదెఁ గాని, జాప్హలితక్కి ఇచ్చివ, ఆబటి ముహెఁ హుక్కొమి కియ్యలి ఇచ్చివ, ఇయ్యనకి హెల్లొ హీఒఁ.
13 ఏనయి ఇచ్చిహిఁ, తొల్లి ఆదాముఇఁ డాయు హవ్వని రచ్చి కిత్తెసిమ?
14 ఎల్లెకీఁఎ బొమ్మ ఆతసి ఆదాము ఆఎ, గాని బొమ్మ ఆహఁ పాపొమిత రీతయి హవ్వెఎ.
15 ఇచ్చీఁవ ఇయ్యస్క ఒడ్డితి మణ్కిగట్టఇ ఆహఁ నమ్మకొముతొల్లె కూడితి జీవునోనితాణ, నీతిత టీకణనంగ నిచ్చ మచ్చిసరి, బండిత ఆహా సుకెమితొల్లె, కొక్కరిపోదయఁణి పాటహఁ పోహి కిహఁ ఏవి గెల్హిను.