క్రీస్తు పాయిఁ అపొస్తులుయఁ ఆతరి
4
1 ఇల్లేకిఁ ఎమ్మిని మణిసివ క్రీస్తుఇఁ సేబ కిన్నరి ఇంజీఁ, మహపురువయి ఆతి డుగ్గాని, అస్సలతఅఁ పాయిఁ కమ్మగట్టరి ఇంజీఁ మా పాయిఁ ఒణపతిదెఁ.
2 ఓడె రో కమ్మత హేరానసి, నమ్మకొముతసినంగ తాను రుజువి కిహకొడ్డితిదెఁ.
3 మీరు ఇచ్చివ, ఓడె ఎమ్మిని మణిసి ఇచ్చివ, నన్నఅఁ తయిపరి కియ్యలి ఒణిపిసరి, ఏదఅఁ పాయిఁ నాను లచ్చెమి కిఒఁ, నంగొ నానువ తయిపరి కిహకొడ్డొఒఁ.
4 నా మణుసు నన్నఅఁ నిందగట్టతి ఇంజీఁ కాకులి కిహాఁజెఎ. గాని ఈదఅఁ పాయిఁ నాను ఏని నింద హిల్లఅ నీతిగట్టతెఎఁ ఇంజీఁ వెస్సకొడ్డొఒఁ, ఇచ్చిహిఁవ నన్నఅఁ కాకులి కియ్యనసి మహపురుఎ.
5 ఇంజెఎ వేల వాఅన తొల్లిఎ, ఇచ్చిహిఁ, యేసురజ్జ వాని పత్తెక, ఏనఅఁ బాటవ కాకులి కిఅన హేరికిహిఁ మంజు. ఏవసి, అందెరిత డుగ్గానఅఁ ఉజ్జెడిత చచ్చహఁ, లోకుతి హిఁయఁ బిత్ర మన్ని ఒణుపూఁణి పుణింబి కిన్నటి, రొఒరొఒసి మహపురుతాణటి సరి ఆతి జూప్క బెట్ట ఆనెరి.
6 తయ్యిఁతెరి, ఈది మింగొ అర్దొమి అయ్యలితక్కిఎ ఈ కత్తయఁ నా ముహెఁ, అపొల్లో ముహెఁ తోప్హకొడ్డహఁ, బఅనలేఁకిఁ నాను మిమ్మఅఁ వెస్సీఁజఇఁ. “మహపురుకత్తత రాచ్చానఅఁ మీరు గ్ణాఅఁతిదెఁ”, ఎచ్చెటిఎ రొఒణి పాడియ మంజహఁ, ఓరొఒణి ముహెఁ నిందయఁ గేట్పిఆఅన మంజలితక్కి, మీరు మమ్మఅఁ హేరికిహిఁ జాపదు.
7 ఏనయి ఇచ్చీఁకి ఎట్కతరి కిహఁ నిన్నఅఁ పెర్గెసి కియ్యనసి ఎంబఅసి? నింగొ మన్నఇ బర్రె అస్సలెఎ మహపురుతాణటి నీను బెట్ట ఆతఇమ? ఈవఅఁ బర్రె అస్సలెఎ మహపురుతాణటి బెట్ట ఆహాఁచివ, ఈవఅఁ మహపురుతాణటి బెట్ట ఆహాలొఒఁ, నంగొ నానుఎ గాణిఁచ కొడ్డితెఎఁ ఇన్నిలేఁకిఁ ఏనఅఁతక్కి నీను గవురొమి ఆహీఁజి?
8 మింగొ నీఎఁతక్కిఎ ఏనయి ఊణ ఆఅన బర్రె మేడ ఆహాఁజతు. నీఎఁతక్కిఎ మీరు సఙసారియఁతెరి ఆహాఁచెరి. మమ్మఅఁ పిస్సహఁ మీరు రజ్జయఁ ఆహాఁచెరి. హఓ, మాంబువ మీతొల్లె రజ్జయఁ ఆనిలేఁకిఁ మీరు అస్సలెఎ రజ్జయఁ ఆహ మచ్చిదెఁ ఇంజీఁ నాను హారెఎ ఆస ఆహిమఇఁ.
9 అపొస్తులుయఁ ఆతి మాంబు, హయ్యలితక్కి* కాకులి బెట్ట ఆహఁ, వర్సె మన్ని బర్రెజాణ కిహఁ డాయు, మహపురు ఇట్టాఁజనెసి ఇంజీఁ నంగొ చోంజ ఆహీఁజనె. తాడెపురుతక్కివ, మహపురుదూతయఁకివ, లోకు బర్రెజాణతక్కివ, మమ్మఅఁ ఏందు బొమ్మయఁలేఁకిఁ ఇట్టాఁజనయి.
10 క్రీస్తు పాయిఁ మమ్మఅఁ బుద్ది హిల్లఅగట్టరి ఇంజిఁ, తాడెపురుతి లోకు ఒణిపీఁజనెరి, గాని మీరు క్రీస్తుతాణ హారెఎ బుద్దిగట్టతొమి ఆహాచొమి ఇంజీఁ ఒణిపీఁజెరి. మాంబు హీణిగట్టతొమి, గాని మీరు బ్డాయుగట్టతెరి. మీరు గవెరెమిగట్టతెరి, గాని మాంబు గవెరెమి హిల్లఅగట్టతొమి.
11 నీఎఁ పత్తెక మాంబు హక్కి ఏస్కిగట్టతొమ్మి, పాడ ఆతి హొబొంరిక హిల్లఅగట్టతొమి. ముట్టితొల్లె కుత్తిని మాడ్డయఁ బెట్ట ఆహీనొమి. మంజలి ఇల్లు హిల్లఅన బత్కీనొమి.
12 మాంబు మా కెస్కతొల్లెఎ కస్టబడిహీఁ కమ్మ కిహీనొమి. మమ్మఅఁ బాక ఇట్టతివ వెండె సీరి హీహినొమి. డొండొ కిహీఁజతివ సాస కిహీనొమి.
13 దుసొవి అయ్యనట్టివ జీవు కందాఁఎ వెండె వెస్సీనొమి. ఈ తాడెపురుతి లోకు మమ్మఅఁ జాండులేఁకిఁ మెస్సీఁజనెరి. బూమిత బర్రెజాణ మమ్మఅఁ గత్రలేఁకిఁ మెస్సీఁజనెరి.
14 మిమ్మఅఁ లజ్జ కియ్యలితక్కి ఇంజీఁ ఆఎ, గాని నాను ఇస్టొమి ఆతి నా కొక్కరిపోదయఁతెరి ఆహాఁ, మీరు జాగెరితనంగ మంజలితక్కి బుద్ది వెస్సీహిఁ, ఈ కత్తయఁ మింగొ రాచ్చిమఇఁ.
15 క్రీస్తుతాణ మిమ్మఅఁ జాప్హనరి దొసొ వెయిజాణ మచ్చివ, మింగొ రొఒసిఎ చంజి.
16 నెహిఁకబ్రు వెస్సిహీఁ, యేసుక్రీస్తుతాణ నాను మిమ్మఅఁ పాటతెఎఁ. ఇంజెఎ మీరు నాలెఁకిఁ బత్కినతెరి ఆహ మచ్చిదెఁ ఇంజీఁ, మిమ్మఅఁ మానొవి కిహీఁజఇఁ.
17 ఈదఅఁ బాట యేసురజ్జతాణ నమ్మకొముతసి ఆతి, నా మీరెఎణిలేఁకి నాను ఇస్టొమి ఆతి తిమోతిఇఁ మీ తాణ పండాఁజఇఁ. నాను క్రీస్తుకి లొఙహఁ ఏనికిఁ బత్కిమఇఁనొ, ఏవణఇఁ మెస్సహఁ మీరు పుంజెరి. ఎల్లెకీఁఎ ఎమ్మిని టాయుతవ, ఎమ్మిని సంగొమికాణవ, నాను ఏనికిఁ జాప్హిమఇఁనొ ఏదని మీరు అర్దొమి కిహకొడ్డిదెరి.
18 నన్నఅఁ మా తాణ వాఒసి ఇంజీఁ, మీ తాణటి కొచ్చెజాణ ఒణపహఁ క్ణెహీఁనెరి.
19 యేసురజ్జకి ఇస్టొమి మచ్చిహిఁ, నాను మీ తాణ తొబ్బె వాహఁ, క్ణెహీఁని ఏవరి కత్తాఁణిఎదెఁ ఆఎ, గాని ఏవరి అస్సలతి బ్డాయుతిఎ హేరికిఇఁ ఇంజీఁ ఒణిపిమఇఁ.
20 మహపురురాజి ఇచ్చిహిఁ మారొ జోలిని కత్తయఁతొల్లె ఆఎ, గాని మా బత్కుత మన్ని ఏవణి బ్డాయు ఆహానె.
21 మీరు ఏనఅఁ ఇస్టొమి ఆహీఁజెరి? *బడ్గ అస్సహఁ నాను మీ తాణ వాఇఁకి? నాను జీవునోని సాదగట్టి మణుసుతొల్లె వాఇఁ? మీరుఎ ఆచ్చకొడ్డదు.