15
1 మోసే హీతి ఆడ్రయఁ జాప్నరి, పరిసయుయఁ, ఏ వేలత యెరూసలేముటి యేసుతాణ వాతెరి.
2 ఇంజఁ, నీ శిశుయఁ కెస్క నొరఅనెఎ రాంద చింజిఁజీనెరి. “కజ్జరి ఇట్టితి మేరతి ఏవరి ఏనఅఁతక్కి మేర కిహీలొఒరి?” ఇంజిఁ వెచ్చెరి.
3 ఇంజఁ యేసు, ఏవరఇఁ, “మీరు, మీ మేర బాటెఎ మహపురు ఆడ్రాణి మేర కిహీలొఒతెరి?
4 ‘తల్లిచంజితక్కి గవెరెమి హీదు.’+ ‘తల్లిని చంజిఇఁ దుసొవి ఆనణఇఁ పాయితిదెఁ’+ ఇంజిఁ మహపురు వెస్తెసి.
5 మీరు వెహ్నయి ఏనయి ఇచ్చిహిఁ, ‘నాను మింగొ సాయెమి కియ్యలి ఇట్టానని, మహపురుకి కానుక హీహమఇఁ.’ ఇంజిఁ, రొఒసి తల్లిని చంజిఇఁ వెస్తిసరి, ఓడె తల్లిచంజితి గవెరెమితొల్లె, నెహిఁకిఁ హేరికిఅతివ దోహొ హిల్లెఎ ఇంజెరి.
6 మీరు, మీ మేరయఁతొల్లెఎ మహపురుకత్తతి పాడఆఅరేటు కిహీఁజెరి.
7 హిఁయఁత రొండని ఇట్టకొడ్డహఁ పంగత రొండని వెహ్నతెరి, యెసయా ప్రవక్త మీ బాట వెస్తయి సరి ఆహేనె.”
8 “ఈ లోకు లూడయఁతొల్లెఎదెఁ నన్నఅఁ పొగ్డనెరి, గాని తమ్మి హిఁయఁ నంగొ హెక్కొ మన్నె.
9 మణిసిఁయఁ ఇట్టితి మేరాణి మహపురు ఇట్టితి ఆడ్రయఁ ఇంజిఁ జాప్హిఁ, ఏవరి నన్నఅఁ లేనిఎ పొగ్డీఁజనెరి”, ఇంజిఁ ఏవరఇఁ వెస్తెసి.+
10 యేసు, జనలోకుతి హాటహఁ, “మీరు వెంజహఁ అర్దొమి కిహకొడ్డదు.
11 పంగటి గూతి బిత్ర హన్నయి మణిసిఇఁ లగ్గెఎ కిఎ, గాని గూతిటి పంగత వానయిఎ మణిసిఇఁ లగ్గెఎ కిన్నె”, ఇంజిఁ ఏవరఇఁ వెస్తెసి.
12 ఇంజఁ తన్ని శిశుయఁ వాహఁ, “పరిసయుయఁ ఏ కత్తయఁ వెంజహఁ కోప ఆహానని, నీను పుంజెఎంజికి?” ఇంజిఁ వెచ్చెరి.
13 ఇంజఁ ఏవసి, “దేవుపురు మన్ని నా చంజి ఉహఅతి బర్రె మొక్కొఁణి హీర్కవెండెఎ రెత్తుహున్నయి ఆనె.
14 ఏవరి ఊసు పిహ్దు, ఏవరి కాణయఁ ఆహఁ మంజహఁ కాణాఁణి జియ్యు తోహ్నరి. కాణఇఁ కాణఎ జియ్యు తోస్తిసరి ఏవరి రిఅరివ గ్డాయుత రీహానెరి” ఇచ్చెసి.
15 పేతురు, “ఈ బఅనతి అర్దొమి మాంబువ పున్నిలేఁకిఁ వెస్తము” ఇంజిఁ ఏవణఇఁ వెచ్చెసి.
16 ఏవసి, “మీరువ నీఎఁ పత్తెక పున్నఅగట్టతెరి ఆహఁజెరికి?
17 గూతిటి బిత్ర హన్నఇ బర్రె బండిత హన్ను. ఏవి గోలి కుగ్గినటి బూమిత హత్తుహ్ను.
18 గాని గూతిటి పంగత వానఇ బర్రె హిఁయఁటి వాను. ఏవిఎ మణిసిఇఁ లగ్గెఎ కిన్ను, ఇంజిఁ మీరు పుంజాలొఒతెరికి?
19 హిఁయఁటి వానఇ ఏనఇ ఇచ్చిహిఁ, లగ్గెఎతి ఒణుపుయఁ, లోకూణి పాయినఇ, రంకు కిన్నఇ, సాని కమ్మయఁ, డొఙ ఆనఇ, బోఁకిని రుజువిక, మహపురుఇఁ దుసొవి ఆనఇ హల్లేఁ,
20 ఇల్లెతఇఎ రొఒణఇఁ లగ్గెఎ కిహీను, కెయ్యు నొరఅన చిచ్చిసరి లగ్గెఎ కిఉ”, ఇంజిఁ వెస్తెసి.
21 యేసు ఎంబటిఎ హోచ్చహఁ తూరు, సీదోను ఇన్ని రాజీణ హచ్చెసి.
22 ఏ కానాను రాజిటి రో ఇయ్య వాహఁ, “రజ్జ దావీదు మీరెఎణతి కర్మ మెస్తము. నా మాంగని పేను బ్డూహఁ హారెఎ డొండొ కిహీనె”, ఇంజిఁ రాగతొల్లె వెస్తె.
23 ఏవసి ఏ ఇయ్యని రో కత్తస్కెఎ హాడ్డ ఆఅతెసి. ఎచ్చెటిఎ తన్ని శిశుయఁ వాహఁ, “ఈ ఇయ్య మా జేచ్చొ ఇచ్చెక కిల్లెడి కిహీనె? ఈ ఇయ్యని పండతుహ్ము”, ఇంజిఁ వెస్తెరి.
24 యేసు ఏవరఇఁ, “పిట్టొవి ఆతి గొర్రీఁలేఁ మన్ని ఇశ్రాయేలు లోకుతాణ పిస్పె, ఓడె ఎంబఅరితాణవ మహపురు నన్నఅఁ పండాఁజొఒసి”, ఇచ్చెసి.
25 గాని ఏ ఇయ్య వాహఁ ఏవణి నోకిత మెండయఁ కుత్తహఁ, “రజ్జ, నంగొ సాయెమి కియ్యము”, ఇచ్చె.
26 ఇంజఁ ఏవసి ఏ ఇయ్యని, “కొక్కరిపోదాఁకి హీని హెఎరతి, నెస్కడాల్కకి హియ్యలి మ్ణీఎ”, ఇచ్చెసి.
27 ఏ ఇయ్య, “అస్సలెఎ రజ్జ, గాని ఇజ్జొతి ఆబ చింజీనటి బల్లటి చొజ్జొ రీని హెఎర గండ్రాఁణి నెస్కడాల్కవ చింజీనుమ?” ఇచ్చె.
28 ఎచ్చెటిఎ యేసు, “ఇయ్య నీను నమ్మితయి, కజ్జయి. నీను నమ్మితిలేఁకిఁఎ నీ మాంగ నెహాఁయి ఆపె”, ఇంజిఁ ఏ ఇయ్యని వెస్తెసి. ఏ వేలతెఎ ఏదని మాంగ ఒడ్డితె.
29 యేసు ఎంబటి వాహఁ, గలిలయ సమ్‍దురి దరి తాకిఁ హజ్జఁ మెట్టత కుగ్గాఁచెసి.
30 హారెఎ జనలోకు, సొటాఁణి, కాణాఁణి, గుల్లాఁణి, అంగవాయఁ హచ్చరఇఁ, మెహ్నరఇఁ చచ్చహఁ, ఏవణి పఅనయఁ నోకిత ఇట్టితెరి. ఏవసి ఏవరఇఁ బర్రెతి ఒట్హెసి.
31 గుల్లయఁ జోలితెరి. కాణయఁ మెస్తెరి. సొటయఁ తాకితెరి. అంగవాయితరివ నెహాఁరి ఆతెరి. ఈవఅఁ బర్రె, ఏ జనలోకు మెస్సహఁ బమ్మ ఆతెరి, ఇంజఁ ఇశ్రాయేలుఁ మహపురుఇఁ పొగ్డితెరి.
32 యేసు తన్ని శిశూఁణి హాటహఁ, “ఈ లోకు నీఎఁతక్కిఎ తీని దిన్న నా తొల్లెఎ మన్నెరి. ఈవరి చింజలి ఏనయివ హిల్లఅకి, నాను ఏవరఇఁ కర్మ ఆహిమఇఁ. ఏవరఇఁ హక్కితొల్లె పండలి నా జీవు ఓపిఁజెఎ. హక్కితొల్లె పండిసరి జియ్యుత కణ్క డుంబహఁ రీనెరిస్కెఎ” ఇచ్చెసి.
33 తన్ని శిశుయఁ, “ఇచ్చొరజాణ లోకుతక్కి ఈ పట్హర బయులుత చింజలి ఏనఅఁ బెట్ట ఆనయి?” ఇంజిఁ ఏవణఇఁ ఇచ్చెరి.
34 యేసు ఏవరఇఁ, “మీ తాణ ఎచ్చొర హెఎరయఁ మన్ను?” ఇంజిఁ వెచ్చెసి. ఏవరి, “సాతగొట్ట హెఎరయఁ, కొచ్చెక ఊణ హుక్వయఁ మన్ను”, ఇచ్చెరి.
35 ఇంజఁ యేసు “జనలోకుతి చొజ్జొ కుగ్గదు”, ఇంజిఁ వెస్తెసి.
36 ఏ సాతగొట్ట హెఎరాఁణి, ఏ హుక్వాణి కెయ్యుత అస్సహఁ మహపురుఇఁ జొహొరి కిహఁ, డాయు ఏవఅఁతి డిక్హఁ తన్ని శిశూఁకి హీతెసి. శిశుయఁ లోకుతక్కి బాటి కిహ హీతెరి.
37 లోకు బర్రెజాణ బండిపంజె చిచ్చి డాయు, హారితి ఏ గండ్రాఁణి, సాత పుట్క నెంజె పెర్హెరి.
38 చిచ్చరిఎ ఇయ్యస్కాణి కొక్కరిపోదాణి కల్పఅన, వరిఇ ఆబాఁఎ సారి మాణ ఆతెరి.
39 డాయు ఏవసి ఏ లోకుతి పండహఁ, డొంగొ లెక్కొ హోచహఁ మగ్దాను ఇన్ని రాజి వాతెసి.