ఆనందమే-పరమానందమే
410
పల్లవి: ఆనందమే-పరమానందమే
ఆశ్రయపురమైన-యేసయ్య నీలో
ఆపత్కాలములన్నిటిలో
ఆదరించిన-అక్షయుడా నీకే స్తోత్రము
1 పచ్చికగల చోట్ల పరుండజేసితివే
జీవజములు త్రాగనిచ్చితివే
నా ప్రాణమునకు సేదదీర్చితివే “ఆనందమే”
2 గాఢాంధకారపు లోయలలొన నేను
సంచరించిన దేనికి భయపడను
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే“ఆనందమే”
3 నా శత్రువుల యెదుటే నీవు
నాకు విందును సిద్దము చేసావు
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము“ఆనందమే”