సిలువలో ఆ సిలువలో
384
పల్లవి: సిలువలో ఆ సిలువలో-ఆఘోర కల్వరిలో
తులువల మధ్యలో-వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా-నీవెంతో అలసితివా
1 నేరము చేయని నీవు-ఈ ఘోర పాపికొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చేనే-నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే-రుధిరంపు ధారలే“వెలియైన”
2 వధకు సిద్దమైన గొఱ్ఱెపిల్ల వోలె
మోమున ఉమ్మి వేయ-మౌనివైనావే
దూషించి అపహసించి-హింసించిరా నిన్ను
ఊహకు అందదు-నీ త్యాగ మేసయ్యా“వెలియైన”
3 నాదు పాపమే నిన్ను-సిలువకు గురిచేసెన్‌
నాదు దోషమే నిన్ను-అణువణువున హింసిచెన్‌
నీవు కార్చిన రక్తధారలే-నా రక్షణాధారం
సిలువను చేరెదను-విరిగిన హృదయము తోను“వెలియైన”