ఆనందింతు నీలో దేవా
375
పల్లవి: ఆనందింతు నీలో దేవా-అనుదినం నిను స్తుతించుచు
మధురమైన నీ నానమునే-మరువక ధ్యానించెద ప్రభువా
1 ఆత్మనాధా అదృశ్యదేవా-అఖిల చరాలకు ఆధారండా
అనయుము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశతీర “ఆనందింతు”
2 నాదు జనములు నను విడిచిననను-నన్ను నీవు విడువకుండ
నీ కను దృష్టి నాపైనుంచి-నాకు రక్షణ శృంగమైన “ఆనందింతు”
3 శ్రేష్టమగు నీ స్వాస్థ్యము కొరకై-మేఘమందు రానైయున్న
ఆ గడియ యెపుడో ఎవరికితెలుసు
అంతం వరకును భద్రపరచుము“ఆనందింతు”