నా నీతి నీవే..
356
పల్లవి: నా నీతి నీవే..నా ఖ్యాతి నీవే.. నా దైవమా యేసయ్యా..నా క్రియలు కాదు..నీ కృపాయో దేవ..నా ప్రాణమా యేసయ్యా..
నదులంత తైలం విస్తార బలులు..నాకిచ్చినా చాలువయ్యా..
నీ జీవితాన్నే నాకిచ్చినావు నీవే నా జీవమయ్యా..
హల్లేలూయా..ఆమేన్-హల్లేలూయా..(2)\rq \rq “నా నీతి నీవే”
1 నా దీనస్థితిని గమనించి నీవు..దాసునిగా వచ్చావుగా..
నా దోష శిక్ష భరియించి నీవు..నన్ను నీలో దాచావుగా..
ఏమంత ప్రేమ నా మీద నీకు..నీ ప్రాణమిచ్చావుగా..
నీ రక్తమిచ్చి కొన్నవు నన్ను..యజమానుడవు నీవేగా..ఆ.ఆ.ఆ..
హల్లేలూయా..ఆమేన్-హల్లేలూయా..(2) “నా నీతి నీవే”
2 ఆ ఊబిలోనా నేచిక్కినప్పుడు..నీవు నన్ను చూసావుగా..
నీ చేయి చాపి నను పైకి లేపి..నీ వాక్కునిచ్చావుగా..
నా సంకటములు.. నా ఋణపుగిరులు..
అన్నిటిని తీర్చావుగా..ఆ.ఆ.ఆ..
నీలోన నాకు నవ జీవమిచ్చి..నీ సాక్షిగా నిలిపావుగా..ఆ.ఆ.ఆ..
హల్లేలూయా..ఆమేన్-హల్లేలూయా..(2) “నా నీతి నీవే”