యోహాను రాస్తి నెగ్గి కబ్రు
నెల్వ కిబిస్నిక
పన్నెండు మన్సిర్ సిస్సుర్ లొఇ ఒరెన్ ఆతి యోహాను రాస్తి పుస్తకమ్‍నె యాక. యేసు యా లోకమ్‍దు బత్కిజి మహివలె జర్గితి సఙతిఙ్‍నె కతవజ వాండ్రు వెహ్తాన్. యేసు ఎయెన్? వాండ్రు దేవుణు మరిసి, దేవుణువెట మహికాన్. దేవుణు తయార్ కితికెఙ్ వాండ్రు సిల్లెండ ఇనికబ కల్గిఎతాద్. వాండ్రె దేవుణు మాట. లోకమ్‍ది వరి పాపమ్‍కు సొన్‍పిస్తెఙ్ పూజ ఆతి గొర్రెపిల్ల. వాండ్రు ఎల్లకాలం బత్కిని బత్కు సీని తిండి. వాండ్రె లోకమ్‍దిఙ్ జాయ్ ఆత మనాన్. నెగ్గి గవ్‍డుఃఎన్. దేవుణుబాన్ సొని సరి ఇజి యేసు వందిఙ్ యా పుస్తకమ్‍దు రాస్త మనాద్. యా యోహాను నెగ్గి కబ్రు ఇని పుస్తకం రాసిమహివలె, రోమ గవ్‍రిమెటుదు మహికార్ దేవుణుదిఙ్ నమితి వరిఙ్ నండొ మాలెఙ్ కిజి మహార్. అందెఙె నమితి వరిఙ్ దయ్‍రం సీదెఙ్ ఇజి యోహాను యా పుస్తకం రాస్తన్.
సఙతిఙ్ తోరిసినిక