ఏత్ర కీర్తన.
యెరూసలేం గుడిః వందిఙ్ పొగ్‌డిఃజి పార్‍జినిక
132
1 ఓ యెహోవ, దావీదుఙ్a ఎత్తు కిఅ
వాండ్రు ఓరిస్తి బాదెఙ విజు ఎతు కిఅ.
2 వాండ్రు ఎద్రు ఉండ్రి పర్మణం కిజి మాట సీజి
యాకోబు మాడిఃసిని గొప్ప సత్తు మని దేవుణుదిఙ్ మొక్కుబడిః కితిక ఎతు కిఅ.
3-5 వాండ్రు మొకి కితిక ఇనిక ఇహిఙ, “యెహోవ వందిఙ్ నాను ఉండ్రి బాడ్డి సూణిదాక
యాకోబు మాడిఃసిని గొప్ప సత్తు మని దేవుణుదిఙ్ మండ్రెఙ్ ఉండ్రి ఇల్లు తొహ్ని దాక,
నాను నా ఇండ్రొ సొన్‍వె, నా మన్సమ్‍దు గూర్‍జి రోమ్ఎ,
నాను నిద్ర కిఎ నా కణుకు రెపెఙ్ మూగ్‌జి వాదెఙ్‍బ సరి సిఎ”, ఇజి
6 మందసంb ఎప్రాతదుc మనాద్ ఇజి మాపు వెహాప్,
వెన్కా యాయీరుd మడిఃఙ అక్క మఙి దొహ్‍క్తాద్
7 వెనుక మాపు వెహ్తాప్, “రదు, యెహోవ మంజిని బాడిఃదు సొనాట్.
వన్ని పాద్దమ్‍క ఆడ్డిగి ముణుకుఙ్ ఊర్‍జి మాడిఃస్నాట్”, ఇహార్.
8 ఓ యెహోవ, నీ సత్తుదిఙ్ గుర్తు లెకెండ్ మని మందసం పెట్టె వెట నీను గుడిఃదు రఅ.
నీను మంజిని బాడ్డిదు రఅ.
9 నీ పుజెర్‍ఙు సొక్కెఙ్ పొర్‍పాజిని లెకెండ్ నీ నీతి తొడిఃగిజి మనిర్
నమకమ్‍దాన్ సేవ కిని పణిమన్సిర్ సర్దదాన్ పాటెఙ్ పారిర్.
10 నీ సేవ మన్సి ఆతి దావీదు వెట కితి పర్మణం వందిఙ్ గుర్తు ఇడ్‍జి
నీను ఎర్‍పాటు కితి రాజుఙ్ నెక్సి పొక్‍మ.
11 “నీ మరిసిర్ లొఇ ఒరెన్ వన్నిఙ్ నీ వెనుక
రాజు వజ ఏలుబడిః కిదెఙ్ నాను ఇడ్‍నాలె
నీ మరిన్‍కు నాను కితి ఒపుమానం లొఙిజి మహిఙ,
నాను వెహ్తి ఆడ్రెఙ లొఙిజి నడిఃతిఙ,
వరి వెన్కాహి వరిఙ్‍బ ఎల్లకాలం నీ సిమసనమ్‍దు
బసి ఏలుబడిః కిదెఙ్ బస్‍పిస్న”, ఇజి
12 యెహోవ దావీదు వెట పర్మణం కితాన్,
వాండ్రు పర్మణం కితి మాట తప్ఎన్.
13 యెహోవ యెరూసలేమ్‍దిఙ్ ఎర్‍పాటు కిజి కేట ఇట్తాన్,
అబ్బె మండ్రెఙ్ ఇజి వాండ్రు కోరితాన్.
14 వాండ్రు వెహ్తాన్, “యాకదె నాను ఇస్టం ఆతి బాడ్డి
ఇబ్బెనె ఎల్లకాలం నాను రోమ్‍జిన, ఇబ్బెనె బత్కిజిన.”
15 యా పట్నమ్‍ది వరిఙ్ నాను కావాల్‍స్తికెఙ్ విజు నాను సీన
ఇబ్బె మని బీదాది వరిఙ్ మన్సు రుఙ్‍ని లెకెండ్ తిండి సీన.
16 ఇబ్బెణి పుజెరిఙ నాను కాపడ్ని
నమకమ్‍దాన్ ఇబ్బె సేవ కిని పణిమన్సిర్ సర్దదాన్ పాటెఙ్ పారిర్.
17 దావీదు మరిసిరిఙ్ అతికారమ్‍దు ఇడ్‍నాలె.
దీవ కసి మంజిని లెకెండ్ వరి ఏలుబడిః నిల్సినె మంజినాద్.
18 నాను వరి పగ్గది వరిఙ్ సిగ్గు సేమర్ కిన
గాని వరిఙ్ నాను గొప్ప పెరి రాజు వజ ఇడ్ని.