యెహోవ దేవుణు విజు వన్కా ముస్కు మని అతికారి
47
1 లోకమ్‍దు మని లోకురండె, కికు కొత్సి సర్ద ఆదు.నండొ సర్ద ఆజి, దేవుణుదిఙ్ డటం పార్జి పొగ్‍డిఃదు.
2 ఎందన్నిఙ్ ఇహిఙ విజెరిఙ్ ముస్కు గొప్ప సత్తు మని,
యెహోవదిఙ్ తియెల్ ఆదు. వాండ్రె లోకమ్‍దు మని,
లోకుర్ ముస్కు గొప్ప సత్తుమని పెరి రాజు ఆత మనాన్.
3 వాండ్రు వన్నిఙ్ నమిఇ లోకుర్ ఎద్రు మఙి గెల్పిస్తాండ్రె,
మా పాదమ్‍క అడిఃగి మా పగ్గది వరిఙ్ మట్త మనాన్.
4 వాండ్రు మా వందిఙ్ పర్మణం కితి మని దేసెం కేట కిజి ఇట్తా మనాన్.
వాండ్రు ప్రేమిసిని యాకోబు లోకురు ఆతి మాపు దన్ని వందిఙ్,
సర్ద ఆజి బుర్ర పెర్జి బేసినాప్.
5 దేవుణు వన్ని సిమసనమ్‍దు బస్తెఙ్ ఎక్సి సొన్సినాన్.
యెహోవ ఎక్సి సొన్నివెలె, లోకుర్ సర్ద ఆజి జోడు బంకెఙ్ ఊహ్‍క్సినార్.
6 దేవుణుదిఙ్ పొగ్‍డిఃజి పాటెఙ్ పార్దు. పాటెఙ్ పార్జి పొగ్‍డిఃదు.
మా రాజు గొప్ప పెరికాన్ ఇజి పొగ్‍డిఃజి పాటెఙ్ పార్దు.
7 ఎందన్నిఙ్ ఇహిఙ దేవుణు లోకం ముస్కు మని
లోకుర్ విజెరిఙ్ రాజు ఆత మనాన్.
దేవుణు వందిఙ్, నెగ్గి పాటెఙ్ పార్దు.
8 దేవుణు, లోకుర్ విజెరిఙ్ రాజు లెకెండ్ ఏలుబడిః కిజినాన్.
దేవుణు వన్ని పరిసుద్ద సిమసనమ్‍దు బసి ఏలుబడిః కిజినాన్.
9 దేసెమ్‍కాణి అతికారిఙు, అబ్రాహాము మాడిఃస్తి దేవుణుదిఙ్
సెందితి లోకుర్ వెట, కూడిఃత మనార్. లోకమ్‍దు మని
అతికారిఙు విజెరె దేవుణు అడిఃగి, వన్ని లోకుర్ ఆత మనార్.
వాండ్రు ఎంబెబా నండొ పెరికాన్ ఆత మనాన్.