రాజు ఉద్దమ్‍దిఙ్ సొనివలె, గెల్‍స్ని వందిఙ్ లోకుర్ పార్దనం కిజినిక
పాటెఙ్ నడిఃపిస్ని వన్నిఙ్ గుర్తుదిఙ్ మనిక. దావీదు కీర్తన.
20
1 ఓ రాజు, పర్మదమ్‍దు మహివలె యెహోవ నిఙి జబాబు సిపిన్.యాకోబు దేవుణు ఆతి యెహోవ నిఙి కాపాడిఃన్.
2 వన్ని వందిఙ్ కేట ఇట్తి సీయోను గొరొతి ఒద్దె నెగ్గి బాడ్డిదాన్ వాండ్రు నిఙి సాయం కిపిన్.
3 నీను సీని అగ్గం పూజెఙ వాండ్రు సర్ద ఆపిన్.
నీను సుర్జి సీని పూజెఙ్ విజు డగ్రు కిపిన్. (సెలా)
4 నీ మన్సుదు కోరిజినికెఙ్ వాండ్రు తీరిస్‍పిన్
నీను ఎత్తు కిజినికెఙ్ విజు జర్గిని లెకెండ్ కిపిన్.
5 అయావలె యెహోవ నిఙి పగ్గ ఆతి వరిఙ్ ఓడిఃసి,
నిఙి రక్సిస్తి వందిఙ్ సర్దదాన్ డేడిఃసినాప్.
మా దేవుణు గొప్ప పెరికాన్ ఇజి వన్ని పేరుదిఙ్ కిక్కు పెర్జి అస్నాప్.
నీను లొస్నికెఙ్ విజు వాండ్రు పూర్తి కిపిన్.
6 యెహోవ ఎర్లిసి ఇట్తి రాజుఙ్ రక్సిసినాన్ ఇజి
యెలు నాను నెస్త మన.
వన్ని పెరి సత్తు మని ఉణెర్ కీదాన్, పడిఃఇ వరిబాణిఙ్ రక్సిసి తోరిస్నాన్.
వన్ని వందిఙ్ కేట ఆతి పరలోకమ్‍దాన్ వన్నిఙ్ జబాబు సీజినాన్.
7 సెగొండార్ ఉద్దం కిదెఙ్ రద్దం బండిఙ్ మనె. గుర్రమ్‍కు మనె ఇజి గర్విసినార్.
గాని మాటు ఇహిఙ మా దేవుణు ఆతి యెహోవ పేరుదాన్ పొగ్‌డెః ఆనాట్.
8 వారు బుర్ర వక్సి, అర్నా సొనార్.
గాని మాపు ఇహిఙ నిఙ్‍జి నెగ్రెండ నిల్‍నాప్.
9 యెహోవ రక్సిస్అ.
మాపు పార్దనం కినివలె రాజు వెంజి మఙి జబాబు సిపిన్.