3
1 ఏడు నెల్లదు ఇస్రాయేలు లోకుర్ విజెరె వరి వరి నాహ్కాఙ్ సొన్సి బస్స ఆతి వెన్కా వారు ఉండ్రె కట్టు ఆతారె, మరి యెరూసలేమ్‍దు కూడ్ఃజి వాతార్. 2 అయావలె దేవుణు పణిమన్సి ఆతి మోసే రాస్తి రూలుఙ్ పుస్తకమ్‍దు మని లెకెండ్ సుర్ని పూజెఙ్ కిదెఙ్ ఇజి యోజాదాకు మరిసి యేసూవని, వన్నివెట పణి కిని పుజెర్‍ఙు, సయల్తీయేలు మరిసి ఆతి జెరుబ్బాబెలుని వన్నిఙ్ సమందిస్తి ఇస్రాయేలు లోకుర్ దేవుణు వందిఙ్ పూజ బాడ్డి తొహ్తార్. 3 అయా దేసెమ్‍దు బత్కిజి మహి లోకురిఙ్ తియెల్ ఆతారె, ముఙల అయా పూజ బాడ్డి మహి బానె మరి మర్‍జి తొహ్తార్. బాన్ వారు యెహోవెఙ్ పెందల్ పొదొయ్ సుర్ని సీని పూజెఙ్ కిజి మహార్. 4 అయాకెఙె ఆఎండ దేవుణు మాటదు మని వజ గుడ్సా ఇని పండొయ్ కిజి ఎమేణి దినమ్‍దు సీని పూజ అయా దినమ్‍దు సుర్‍జి సితార్.5 అయావజనె రోజు సుర్ని సీని పూజెఙ్, ఆమాస్ పునమ్‍కాఙ్ యెహోవెఙ్ సీదెఙ్ ఇజి ఎర్‍పాటు కితి పూజెఙ్, ఒరెన్ ఒరెన్ మన్సు పూర్తిదాన్ ఇనాయం తని పూజెఙ్‍బ సితార్. 6 ఏడు నెల్ల మొదొహి దినమ్‍దాన్ యెహోవెఙ్ పూజెఙ్ సీదెఙ్ మొదొల్‍స్తార్. గాని నస్తివలె యెహోవ గుడిః తొహ్తెఙ్ పునాది పొక్ఎండ మహార్. 7 అహిఙ వారు తాపి మేస్తుర్‍ఙని, పణికహ్కాఙ్ డబ్బు సితార్. అక్కదె ఆఎండ పారసీక దేసెమ్‍దిఙ్ రాజు ఆతి కోరెసు సెల్వ సితి వజ సీదోను, తూరు పట్నమ్‍కాణి వరిఙ్ దేవదారు మర్రెక్‍ని, లెబాను మర్రెక్ సమ్‍దరం సరి యొప్పే పట్నం రేవు దాక తసి సీదెఙ్ ఇజి తిండి, కడుః, నూనె సితార్.
8 అహిఙ దేవుణు గుడిః మని యెరూసలేము పట్నమ్‍దు ఇస్రాయేలు లోకుర్ వాతి రుండి సమస్రం, రుండి నెల్లదు పయెల్‍తియెలు మరిసి ఆతి జెరుబ్బాబెలు, యోజాదాక మరిసి ఆతి యేసువ, వరివెట మహి పుజెర్‍ఙుని, లేవి తెగ్గదికార్ వెట్టి పణి కిని బణిఙ్ యెరూసలేమ్‍దు మర్‍జి వాతి విజెరె దేవుణు గుడిః తొహ్తెఙ్ మొదొల్‍స్తార్. ఇరవయ్ సమస్రమ్‍కు డాట్‍తి లేవి తెగ్గది వరిఙ్ యెహోవ గుడిః తొహ్ని వందిఙ్ సూణి అతికారిఙ్ వజ ఎర్‍పాటు కితార్. 9 యేసువని వన్ని మరిసిర్, వన్ని దాదా తంబెర్‍ఙు, కద్‍మీయేలుని, వన్ని మరిసిర్, హోదవ్‍యని, వన్ని మరిసిర్, హేనాదాదు మరిసిర్, హేనాదాదు మరిసిర్ పొటది మరిసిర్, లేవి తెగ్గది వరి విర్ర కట్కు, దేవుణు గుడిఃదు పణి కిని వరి ముస్కు తన్‍కి కిని వరి వజ ఎర్‍పాటు ఆతార్. 10 దేవుణు గుడిః తొహ్నికార్ యెహోవ గుడిః తొహ్తెఙ్ పునాది కార్‍సి మహిఙ్, ఇస్రాయేలు లోకురిఙ్ రాజు ఆతి దావీదు ఎర్‍పాటు కితి మహి పద్దతి వజ పుజెర్‍ఙు నిరీ సొక్కెఙ్ తొడిఃగితారె సుటు బాంకెఙ్ ఊక్సి మహార్. ఆసాపు కుటుమ్‍దిఙ్ సెందితి లేవి కుటుమ్‍దికార్ బాజెఙ్ డెఃయ్‍జి నిహారె యెహోవెఙ్ పొగ్‍డిఃతార్. 11 వారు వందనమ్‍కు వెహ్సి, పొగ్‍డిఃజి ఉండ్రి పాట వజ పల్లి అసి,
“యెహోవ గొప్ప దయ మనికాన్,
వన్ని దయ దర్మం ఇస్రాయేలు లోకుర్ ముస్కు ఎల్లకాలం నిన మంజినాద్‍లె”a.
యెహోవ గుడిః పునాది కారితిక లోకుర్ విజెరె సుడ్ఃతారె యెహోవెఙ్ గట్టిఙ డేడిఃసి పొగ్‍డిఃతార్.
12 గాని పుజెర్‍ఙుని, లేవి తెగ్గదికార్ వరి వరి తెగ్గెఙ పెద్దెల్‍ఙు వజ మహికార్, ముఙల తొహ్తి మహి గుడిఃదిఙ్ సుడ్ఃతి నండొండార్ డొక్రార్ యా గుడిః పునాది కారితిక సుడ్ఃతారె నండొ అడఃబతార్. మహికార్ నండొండార్ లావు సర్ద ఆజి గట్టిఙ డేడిఃస్తార్. 13 లోకుర్ విజెరె నండొ గగొల్ ఆజి మహిఙ్ ఎమే జాటు సర్ద ఆజినికాదొ, ఎమే జాటు అడఃబజినికాదొ వారు నెస్‍ఎతార్. అయా జాటు లావునండొ దూరం సొన్సి మహాద్.