సొలొమోను తొహిస్తి పట్నమ్‍కు
8
1 సొలొమోను యెహోవ గుడిఃని, వన్ని బంగ్ల తొహిస్తెఙ్ 20 పంటెఙ్ అస్తాద్. 2 హీరాము రాజు సితి మహి పట్నమ్‍కుబ సొలొమోను మర్‍జి తొహిస్తాండ్రె, అయా పట్నమ్‍కాఙ్ బత్కిదెఙ్ ఇస్రాయేలు లోకురిఙ్ సితాన్. 3 అయావెన్కా సొలొమోను, సోబా ఇని ప్రాంతం మని హమాతు పట్నమ్‍దు సొన్సి అక్కబ లాగె ఆతాన్. 4 మరి బిడిఃమ్ బూమిదు మని తద్మోరు పట్నమ్‍బ తొహిస్తారె, హమాతు దేసెమ్‍దు మని పట్నమ్‍కాఙ్ వన్కా సుట్టుల బారి గోడ్డెఙ్ తొహిసి పంట ఇడ్ని గాదెఙ్‍బ తొహిస్తాన్. 5 అక్కెఙ్‍నె ఆఎండ సొలొమోను ఎక్కు బెత్‌హొరొనుదు, డిగు బెత్‌హొరొనుదు సుట్టుల బారి గోడ్డెఙ్ తొహిసి పెరి సహ్కు ఇడ్డిసి, సేహ్లెఙ్ గడెఃఙ్ తయార్ కిబిస్తాన్. 6 మరి సొలొమోను, బయతాతు పట్నమ్‍దిఙ్‍ని, గాదిఙ్ మని పట్నమ్‍కు, వన్ని రద్దం బండిఙ్‍ని, వన్ని గుర్రమ్‍కు ఇడ్ని పట్నమ్‍కు తొహిస్తాన్. ఆహె యెరూసలేమ్‍దుని లెబానోనుదు వాండ్రు ఏలుబడిః కిజి మహి ప్రాంతమ్‍కాఙ్ విజుబాన్ ఇని ఇనికెఙ్ తొహిస్తెఙ్ ఇజి ఒల్‍బితాండ్రొ అయాక్కెఙ్ విజు తొహిస్తాన్.7-8 అయా కాలమ్‍దు ఇస్రాయేలు లోకుర్ ఆఇకార్ ఎయెర్ ఇహిఙ అమోరీ, హిత్తియ, పెరిజ్జి, హివ్వియ, యెబుసి జాతిఙాణికార్ సెగొండార్ ఎంజిత మహార్. ఎందన్నిఙ్ ఇహిఙ ఇస్రాయేలు లోకుర్ విరిఙ్ సప్ఎండ డిఃస్త సిత మహార్. విరిఙ్‍నె సొలొమోను రాజు ఇస్రాయేలు లోకుర్ అడ్గి వెట్టి పణి కిదెఙ్ ఎర్‍పాటు కితాన్. అందెఙె వారు నెహి దాక అయా పణినె కిజినార్. 9 గాని ఇస్రాయేలు లోకురిఙ్ ఎయెఙ్‍బ వెట్టి పణి కిబిస్ఎతాన్. వరిఙ్ సయ్‍నమ్‍దు అతికారిఙ్ వజ, రద్దం బండిఙ్ నడిఃపిస్ని వరి వజ, గుర్రమ్‍కు నడిఃప్ని వరి వజ సొలొమోను ఎర్‍పాటు కితాన్. 10 వరి లొఇ 250 మన్సిదిఙ్ సొలొమోను రాజు లోకుర్ ముస్కు ముక్కెలం ఆతి అతికారిఙ్ వజ ఎర్‍పాటు కిత మహాన్.
11 నస్తివలె సొలొమోను రాజు, “ఇస్రాయేలు లోకురిఙ్ రాజు ఆతి దావీదు ఇని పట్నమ్‍దు, నా ఆలు మండ్రెఙ్ ఆఎద్, ఎందన్నిఙ్ ఇహిఙ యెహోవ మందసం పెట్టె మంజిని బాడ్డి సుబ్బరం ఆతిక”, ఇజి ఒల్‍బితాండ్రె వన్ని అడ్సి వందిఙ్ తొహిస్తి బంగ్లదు దావీదు ఇని పట్నమ్‍దాన్ దన్నిఙ్ అసి వాతాన్. 12 యెహోవ వందిఙ్ సొలొమోను ముఙల తొహిస్తి నెగ్గి బాడ్డి డగ్రు మని పూజ బాడ్డి ముస్కు సుర్ని పూజెఙ్ కితాన్. 13 మోసేఙ్ సితి రూలుఙ్ వజనె సొలొమోను రాజు విజు కిజి వాతాన్ అక్క ఎలాగ ఇహిఙ రొమ్‍ని దినమ్‍కాఙ్, ఆమస్‍పునమ్‍దిఙ్ కినికెఙ్ కిజి, పుల్లఙ్ ఆఇ దూరుదాన్ పిట్టమ్‍కు కిని పండొయ్, వారం రొస్కు పండొయ్, గుడ్సా ఇని పండొయ్‍ఙు కిజి యెహోవ వందిఙ్ పూజెఙ్ కిజి వాతాన్. యా లెకెండ్ సమస్రమ్‍దిఙ్ మూండ్రి సుట్కు పండొయ్‍ఙు కిజి మహాన్.a 14 సొలొమోను వన్ని బుబ్బ ఆతి దావీదు నాయం కితి మహివజ, లేవి తెగ్గిది వరిఙ్, వరివరి కుటుమ్‍క వరుసదాన్ వరిఙ్ మని వంతు వజ పెరి పూజెర్‍ఙ సాయం కిదెఙ్ ఎర్‍పాటు కితాన్. సెగోండారిఙ్ రోజు పొగ్‌డిఃజి పాటెఙ్ పార్‍ని వరివజ, సెగోండారిఙ్ గుడిఃది సహ్కాఙ్ కాప్‍కిని వరి వజ, సెగోండారిఙ్ పూజ కిదెఙ్ తని వస్తుఙ్ ఇడ్ని వరి వజ ఎర్‍పాటు కితాన్. 15 గాదిఙ కాప్ కినికార్ ఆతిఙ్‍బ, మరి ఇని దన్నిఙ్ కాపుకినికార్ ఆతిఙ్‍బ, రాజు పుజెర్‍ఙని, లేవి తెగ్గది వరిఙ్ నాయం కితి వజనె కిజి వాతార్. 16 యెహోవ గుడిః తొహ్తెఙ్ పునాది పొక్తి బాణిఙ్ అసి, అక్క పూర్తి ఆని దాక, సొలొమోను వెహ్తివజనె ఆ పణి కిజి యెహోవ గుడిః తొహ్తెఙ్ పూర్తి కితార్. 17 అయావెన్కా సొలొమోను రాజు, ఎసోన్గెబెరు, ఏలతు పట్నమ్‍కాఙ్ సొహాన్. అయా పట్నమ్‍కు ఎదోము దేసెమ్‍దు ఎర్రన్ సమ్‍దరం పడఃకాద్ మనె. 18 నస్తివలె హీరాము వన్ని ఓడెఃఙ్‍ని వాన్కాఙ్ నెగ్రెండ నడిఃపిస్తెఙ్ నెస్ని వన్ని పణిమన్సిరిఙ్ పోక్తాన్. వారు వాజి సొలొమోను లోకుర్ వెట కూడ్ఃజి ఓపిరు దేసెమ్‍దు సొహారె, అబ్బెణిఙ్ 50 వెయిఙ్ (మణుగుఙ్) కేజిఙ్ బఙారం సొలొమోను రాజు డగ్రు తతార్.