ఇస్రాయేలు లోకుర్ ముస్కు హోసేయ రాజు ఆతిక
17
1 అయావలె యూదా లోకురిఙ్ రాజు ఆతి ఆహాజు 12 పంటెఙ్ ఏలుబడిః కితి మహిఙ్, ఏలా మరిసి ఆతి హోసేయ ఇస్రాయేలు లోకురిఙ్ రాజు ఆతాండ్రె సొమ్రోను పట్నమ్‍దు మంజి 9 పంటెఙ్ ఏలుబడిః కితాన్. 2 గాని విన్నిఙ్ ఇంక ముఙల ఇస్రాయేలు లోకురిఙ్ రాజు ఆతికార్ యెహోవ ఎద్రు సెఇ పణిఙ్ కితి లెకెండ్‍నె, వీండ్రుబ కొక్కొ సెఇ పణిఙ్ కితాన్. 3 అహిఙ హోసేయ రాజు వెట అసూరు దేసెమ్‍ది రాజు సల్మనేసెరు ఉద్దం కిదెఙ్ వాతాన్ కక, హోసేయ రాజు వన్నిఙ్ లొఙితాండ్రె వన్నిఙ్ పన్ను తొహ్తాన్. 4 అయావెన్కా హోసేయ రాజు అసూరు దేసెమ్‍ది రాజుఙ్ పన్ను తొహ్తెఙ్ డిఃస్తాండ్రె, వన్ని పణిమన్సిరిఙ్ అయ్‍గుప్తు దేసెమ్‍దు రాజు ఆతి సో ఇని వన్నిబాన్ పోక్తాన్. యా లెకెండ్ హోసేయ రాజు కితి కుట్ర వందిఙ్, అసూరు దేసెమ్‍ది రాజు నెస్తాండ్రె వన్నిఙ్ తొహ్సి ఒసి జేలిదు ఇట్తాన్. 5 అయావలె అసూరు రాజు ఇస్రాయేలు దేసెం ముస్కు ఉద్దం కిజి వాతాండ్రె, సొమ్రోను పట్నమ్‍దు మూండ్రి పంటెఙ్ ఉద్దం కితాన్. 6 అహిఙ హోసేయ రాజు ఏలుబడిః కిజి 9 పంటెఙ్ ఆతి మహిఙ్, అసూరు దేసెమ్‍ది రాజు సొమ్రోను పట్నమ్‍దు ఉద్దం కితాండ్రె, ఇస్రాయేలు లోకురిఙ్ అసూరు దేసెమ్‍దు తొహ్సి ఒసి, హాబోరు గడ్డ డగ్రు మని హాలహు, గోజాను, మాదీయది ఇని పట్నమ్‍కాఙ్ వరిఙ్ వెట్టి పణిమన్సిర్ వజ ఇట్తాన్.7-8 ఎందన్నిఙ్ ఇహిఙ, ఇస్రాయేలు లోకురిఙ్ అయ్‍గుప్తు దేసెమ్‍ది పరో కీదాన్ డిఃబిసి తతి, వరి దేవుణు ఆతి యెహోవ ఎద్రు పాపం కిజి, వరి ఎద్రుహాన్ యెహోవ ఉల్‍ప్తి లోకుర్ మాడిఃసి మహి ఆఇ ఆఇ దేవుణుకాఙ్ తియెల్ ఆజి, వరి ఆసారమ్‍కుని ఇస్రాయేలు రాజుర్ ఎర్‍పాటు కితి ఆసారమ్‍కు వజ వారు నడిఃతార్. 9 ఆహె గొరొక ముస్కు బత్కిజి మహి నాహ్కాణికార్‍ని బారి గోడ్డెఙ్ మని పట్నమ్‍కాఙ్ బత్కిజి మహి ఇస్రాయేలు లోకుర్ విజెరె యెహోవెఙ్ నెసిబ నెసి లెకెండ్ డిఃసి సీజి, వన్నిఙ్ పడిఃఎండ తపు బోదెఙ్ వెహ్సి వరి బాడ్డిఙ పూజ బాడ్డిఙ్ తొహిస్తార్. 10 మరి గొరొక్ ముస్కు మని పస్రు మర్రెక అడ్గి పూజ బాడ్డిఙ్ తొహ్సి, దెయం బొమ్మెఙ్, కొహిఙ్ నిల్‍ప్తార్. 11 అక్కదె ఆఎండ వరి డగ్రుహాన్ యెహోవ డక్సి పేర్‍తి లోకుర్ కితి ఆసారమ్‍కు వజ వీరుబ గొరొక ముస్కు మని పూజ బాడ్డిఙ దూపమ్‍కు సుర్‍జి, సెఇ పణిఙ్ కిజి, యెహోవెఙ్ ఒద్దె కోపం పుటిస్తార్. 12 యెహోవ ఇస్రాయేలు లోకురిఙ్ ఇని వన్కాఙ్ ఇహిఙ మాడిఃస్మాట్ ఇజి వెహ్తా మహాండ్రొ అయా వన్కాఙ్‍నె వారు మాడిఃస్తార్.
13 అహిఙ యెహోవ, “మీరు అయా సెఇ పణిఙ్ కిదెఙ్ డిఃసి సీదు, నాను మీ అన్నిగొగొరిఙ్ రూలుఙ్ సిత మన. అయా రూలుఙ్ నా పణిమన్సిర్ వెట, నా ప్రవక్తర్ వెట అయా రూలుఙ్ నెస్‍పిస్త మన. అందెఙె మీరు అయా రూలుఙ్, ఆడ్రెఙ్ లొఙిజి నడిఃదు”, ఇజి ఇస్రాయేలు లోకుర్‍ఙ, యూదా లోకుర్‍ఙ గట్టిఙ వెహ్తాన్. 14 గాని వారు అయా మాటెఙ కాత్ర కిఎండ, వరి దేవుణు ఆతి యెహోవెఙ్ నమిఎండ, వరి అన్నిగొగొర్ సెడిఃతి సొహి లెకెండ్ వీరుబ సెడిఃత సొహార్. 15 వారు వరి అన్నిగొగొర్ వెట కితి ఒపుమానమ్‍దిఙ్‍ని వాండ్రు సితి రూలుఙ్ నెక్సిపొక్సి, సెఇకెఙ్ కిజి సెడిఃజి సొహార్. వరి సుట్టుల మహి లోకుర్ కిని ఆసారమ్‍కు వజ కిమాట్ ఇజి యెహోవ వెహ్తాన్. గాని వరి లెకెండ్‍నె వీరుబ కిజి నడిఃతార్. 16 వారు వరి దేవుణు ఆతి యెహోవ సితి ఆడ్రెఙ్ లొఙిఎండ, వారు రుండి దూడః బొమ్మెఙ్ తయార్ కితారె, బఙారం పూత రాసి, అసెరా దెయం వందిఙ్ కొహిఙ్ నిల్‍ప్సి, నెల్ల, పొద్దు సుక్కెఙ, బయలు దెయమ్‍కాఙ్ మాడిఃస్తార్. 17 ఆహె వారు లామి సుడ్ఃజి, విద్దెఙ్ కిజి, వరి మరిసిర్‍ఙ, గాడ్సికాఙ్ సిస్సుదు పూజ కిజి, యెహోవ ఎద్రు సెఇ పణిఙ్ కిజి వన్నిఙ్ ఒద్దె కోపం పుటిస్తార్.
18 అందెఙె యెహోవ ఇస్రాయేలు లోకుర్ ముస్కు నండొ కోపం ఆతాండ్రె, వన్ని ఎద్రు మన్ఎండ వరిఙ్ డక్సి పేర్‍తాన్. గాని యూదా తెగ్గది లోకుర్‍నె వన్ని ఎద్రు మహార్. మరి ఎమెణి తెగ్గదికార్‍బ మన్ఎతార్.
యూదా లోకుర్ పాపం కితిక
19 గాని యూదా లోకుర్ వరి దేవుణు ఆతి యెహోవ వెహ్తి ఆడ్రెఙ్ వజ నడిఃఎండ, ఇస్రాయేలు లోకుర్ కిజి మహి ఆసారమ్‍కు వజ నడిఃజి మహార్. 20 అందెఙె యెహోవ ఇస్రాయేలు లోకుర్ విజెరిఙ్ నండొ బాదెఙ్ కిజి, వరిఙ్ ఆఇ జాతిది వరి కీదు ఒప్పజెప్సి, వరిఙ్ డిఃస్త సితాన్. 21 యెహోవ దావీదు రాజు కుటుమ్‍దాన్ ఇస్రాయేలు లోకురిఙ్ కేట కితిఙ్, వారు నెబాతు మరిసి ఆతి యరొబాముఙ్ రాజు కితార్. నస్తివలె వాండ్రు యెహోవ ఆడ్రెఙ్ వెహ్సిని వజ ఇస్రాయేలు లోకురిఙ్ నడిఃపిస్ఎండ, వరిఙ్ బయంకరమాతి తపు సరిదు నడిఃపిస్తాన్. 22 అందెఙె వారుబ యరొబాము కితి పాపమ్‍కు వజనె కిజి నడిఃతార్. 23 యెహోవ, వన్ని సేవ పణిమన్సిర్ ఆతి ప్రవక్తార్ వెట వెహ్‍పిస్తి మాట వజ ఇస్రాయేలు లోకురిఙ్ యెహోవ డిఃస్ని సీని దాక, వారు పాపం కిజినె మహార్. అందెఙె అసూరు దేసెమ్‍దికార్ వాతారె వరిఙ్ తొహ్సి ఒతార్. వారు యెలు దాక బానె మనార్.
సొమ్రోనుదు ఆఇ లోకుర్ బత్కిదెఙ్ మొదొల్‍స్తిక
24 అయావలె అసూరు దేసెమ్‍ది రాజు, బబులోనుదాన్ అసి, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము ఇని పట్నమ్‍కాణి లోకురిఙ్ కూక్సి తతాండ్రె, ఇస్రాయేలు లోకుర్ బత్కిజి మహి సొమ్రోను పట్నమ్‍దు ఇట్తాన్. వారు సొమ్రోను ప్రాంతం సొంతం కిబె ఆతారె, ఆ ప్రాంతం సుట్టుల మని పట్నమ్‍కాఙ్ బత్కిజి మహార్. 25 గాని వరిఙ్ యెహోవ ముస్కు బక్తి, తియెల్ సిల్లెద్. అందెఙె వరి ముస్కు నొరెస్కాఙ్ పోక్తాన్‍కక, ఆ నొరెస్కు వరిబాన్ వాతెనె వరిఙ్ సెగొండారిఙ్ సప్సి పొక్తె.
26 అయావలె వారు, “నీను సొమ్రోను పట్నమ్‍దు తొహ్సి తతి ఇట్తి లోకుర్ దేవుణు వందిఙ్ మని రూలుఙ్ నెస్ఎర్. అందెఙె యెహోవ వరి నడిఃమి నొరెస్కాఙ్ పోకిస్తాన్‍కక, అక్కెఙ్ వరిఙ్ సప్‍సి పొక్సినె. ఎందన్నిఙ్ ఇహిఙ, యెహోవ ఇస్రాయేలు లోకురిఙ్ సితి రూలుఙ్ వజ వారు బత్కిదెఙ్ నెస్ఎర్”, ఇజి అసూరు రాజు బాన్ కబ్రు పోక్తార్. 27 అందెఙె అసూరు రాజు, “సొమ్రోను పట్నమ్‍దాన్ తొహ్సి తతి సెగొండార్ పుజెర్‍ఙు ఇబ్బె మనార్. వరి లొఇ ఒరెన్ వన్నిఙ్ ఇబ్బెణిఙ్ కూక్సి ఒతు. వాండ్రు అబ్బె వాతిఙ దేవుణు వందిఙ్ మని రూలుఙ్ వరిఙ్ ఒజ్జ కినాన్”, ఇజి ఆడ్ర సితాన్. 28 అయావెన్కా సొమ్రోను పట్నమ్‍దాన్ తొహ్సి ఒతి మహి ఇస్రాయేలు లోకుర్ లొఇ ఒరెన్ పుజెరి సొహాండ్రె బేతేలు పట్నమ్‍దు మంజి, యెహోవ ముస్కు తియెల్ బక్తిదాన్ మండ్రెఙ్ వరిఙ్ ఒజ్జ కితాన్. 29 గాని ఆ పట్నమ్‍కాఙ్ బత్కిజి మహి లోకుర్ విజెరె వరి వరి దేవుణుక బొమ్మెఙ్ తయార్ కిజి, దిన్నిఙ్ ఇంక ముఙల సొమ్రోను పట్నమ్‍దికార్ గొరొక ముస్కు తొహ్తి మహి గుడిఃఙ వరి దేవుణు బొమ్మెఙ్ ఒత ఇట్తార్. 30 నస్తివలె బబులోను దేసెమ్‍దికార్ సుక్కోతు బెనోతు ఇని దెయం, కూతా పట్నమ్‍దికార్ నెర్గలు ఇని దెయం, హమాతు పట్నమ్‍దికార్ అసీమా ఇని దెయం, 31 అవ్వా ఇని ప్రాంతమ్‍దికార్ నిబ్‌హజు దెయమ్‍ని తర్తాక్ ఇని దెయం బొమ్మ తయార్ కితార్. ఆహె సెపర్వయీము ఇని పట్నమ్‍దికార్ వరి కొడొఃరిఙ్ అద్రమ్మెలెకు, అనెమ్మెలెక్ ఇని దెయమ్‍క వందిఙ్ సిస్సు ముస్కు సుర్‍జి పూజ సితార్. 32 అహిఙ వారు యెహోవెఙ్ తియెల్ ఆజి, గొరొక ముస్కు మని పూజ బాడ్డిఙ, వరి నడిఃమి మహి మాముల్ లోకురిఙ్ పుజెర్‍ఙు వజ ఎర్‍పాటు కితార్ కక, వారు వరి వందిఙ్ గొరొక ముస్కు మని గుడిఃఙ పూజెఙ్ కిజి మహార్. 33 అయావజ వారు యెహోవెఙ్ తియెల్ బక్తిదాన్ మహార్. గాని వారు ఎమెణి ఎమెణి దేసెమ్‍కాణిఙ్ వాతారో, వరి దేసెమ్‍ది దెయమ్‍కాఙ్ కిని ఆసారం వజనె వారు సేవ కిజి మహార్. 34 వారు యెలు దాక ముఙల్ కిజి మహి ఆసారం వజనె కిజినార్. యెహోవ ఇహిఙ వరిఙ్ తియెల్ బక్తి సిల్లెద్. ఆహె ఇస్రాయేలు ఇజి పేరు పొందితి యాకోబు కుటుమ్‍ది వరిఙ్ యెహోవ వెహ్తి ఆడ్రెఙ, రూలుఙ, పద్దతిఙ, నాయం ఆతి పణిఙ వారు లొఙిజి నడిఃఎండ ఆతార్. 35 దిన్నిఙ్ ఇంక ముఙల యెహోవ యాకోబు కుటుమ్‍ది వరిఙ్ ఒపుమానం కిజి ఈహు ఆడ్ర సిత మహాన్, “మీరు ఆఇ ఆఇ దెయమ్‍కాఙ్ మాడిఃస్మాట్. వన్కాఙ్ లొఙిజి తియెల్‍దాన్ బక్తిదాన్ సేవ కిమాట్, పూజెఙ్ కిమాట్. 36 యెహోవ వన్ని నండొ సత్తుదాన్ వన్ని కియు సాప్‍సి, మిఙి అయ్‍గుప్తుదాన్ డిఃబిసి తత్తి యెహోవెఙ్‍నె మీరు లొఙిజి గవ్‍రం సీదెఙ్‍వలె. వన్నిఙ్‍నె మాడిఃసి సేవ కిదెఙ్‍వలె. 37 వాండ్రు మిఙి రాసి సితి ఆడ్రెఙ్, నాయం ఆతి పణిఙ్, రూలుఙ్, పద్దతిఙ్ ఒజ్జజి, అయావజ మీరు నడిఃజి మండ్రెఙ్ వలె. మీరు దెయమ్‍కాఙ్ తియెల్ ఆదెఙ్ అవ్‌సరం సిల్లెద్. 38 నాను మీ వెట కితి ఒపుమానం మీరు పోస్నిక ఆఎద్. ఆఇ ఆఇ దెయమ్‍క ముస్కు మిఙి తియెల్ బక్తి మంజినిక ఆఎద్. 39 మీ దేవుణు ఆతి నఙి తియెల్‍దాన్ లొఙిజి నడిఃజి మహిఙ నాను మీ పగ్గతి వరి బాణిఙ్ మిఙి డిఃబిస్నా”, ఇజి వరిఙ్ వెహ్తాన్.