పణుకుదాన్ ఏరు సోతిక
17
1 మరి ఇస్రాయేలు లోకుర్ విజెరె కూడిఃతారె యెహోవ వెహ్తి లెకెండ్ వారు సీను ఇని బిడిఃమ్ బూమిదాన్ సోతారె ఉండ్రి బాడ్డిదాన్ మరి ఉండ్రి బాడ్డిదు మార్‍జి రెపిదిముదు వాతార్. బాన్ ఉండెఙ్ ఏరు సిల్లితి వందిఙ్ ఆజి, 2 వారు మోసే వెట జట్టిఙ్ ఆజి, “మాపు ఉండెఙ్ ఏరు సిదా”, ఇజి లొస్తార్. అందెఙె మోసే వరివెట, “మీరు నా వెట ఎందన్నిఙ్ జటిఙ్‍దిఙ్ వాజినిదెర్? ఎందన్నిఙ్ మీరు యెహోవెఙ్ పరిస కిజినిదెర్?”, ఇజి వెహ్తాన్. 3 గాని వారు బాన్ ఏరు సిల్లిఙ్ లావు హేక్కిదాన్ మనార్. అందెఙె వారు మోసేఙ్ ముర్లిజి, “మఙిని మా కొడొఃరిఙ్, మా పస్విదిఙ్ హేక్కిదాన్ సప్తెఙ్‍నా, అయ్‍గుప్తు దేసెమ్‍దాన్ నీను మఙి ఇబ్బె తతి?”, ఇజి వెహ్తార్.4 నస్తివలె మోసే, “యా లోకురిఙ్ నాను ఇనిక కిదెఙ్? మరి సణెం మహిఙ వీరు నఙి పణ్కఙణిఙ్ డెఃయ్‍జి సప్ని లెకెండ్ మనార్”, ఇజి యెహోవెఙ్ పార్దనం కితాన్.
5 నస్తివలె యెహోవ మోసే వెట, “నీను ఇస్రాయేలు లోకురి పెద్దెల్‍ఙ లొఇ కొకొండారిఙ్ అసి జెనం ముఙల సొన్అ. నీను నయ్‍లు పెరి గడ్డదిఙ్ డెఃయ్‍తి డుడ్డు నీ కీదు అసి సొన్అ. 6 ఇదిలో, నాను హోరేబు గొరొతు పెరి పణుకు ముస్కు నీ ముఙల్ నిన. నీ కీదు మని డుడ్డుదాన్ అయా పణుకుదిఙ్ డెఃయ్‍తిఙ బాణిఙ్ యా జెనం ఉండెఙ్ ఏరు వానె”, ఇజి వెహ్తాన్ కక, మోసే ఇస్రాయేలు లోకురి పెద్దెల్‍ఙు సుడ్ఃజి మహిఙ్‍నె అయా లెకెండె కితాన్. 7 అయా బాడ్డిదిఙ్ మోసే మస్సా aఇజి, మెరీబాb ఇజి పేర్కు ఇట్తాన్. ఎందన్నిఙ్ యెహోవ మా నడిఃమి మనాండ్రా? సిల్లెనా? ఇజి వారు యెహోవెఙ్ పరిస కితార్. మరి వారు యెహోవెఙ్ జట్టిఙ్ ఆతార్.
అమాలేకి జాతిదికార్ ఉద్దం కితిక
8 అయావలె ఇస్రాయేలు లోకుర్ రెపిదిముదు మహిఙ్ అమాలేకు జాతిదికార్ వాతారె ఉద్దం కితార్. 9 నస్తివలె మోసే యెహోసువ వెట, “మా వందిఙ్ ఆజి కొకొండార్ లోకురిఙ్ కేట కిజి వరిఙ్ అసి సొన్సి అమాలేకి జాతిది వరివెట ఉద్దం కిఅ. విగెహిఙ్ దేవుణు నఙి అసి సొన్అ ఇజి వెహ్తి డుడ్డు నాను అస్నానె యా గొరొన్ ముస్కు సొన నినాలె”, ఇజి వెహ్తాన్.
10 అందెఙె యెహోసువ, మోసే మాటదిఙ్ లొఙితాండ్రె, అమాలేకి జాతిది వరివెట ఉద్దం కిదెఙ్ సొహాన్. నస్తివలె మోసే ఆరోను, హురు ఇనికార్ అయా గొరొన్ ముస్కు ఎక్సి సొహార్. 11 మోసే వన్ని కీదు మని డుడ్డు ముస్కు పెహ్తి మహివలె ఇస్రాయేలు లోకుర్ ఉద్దమ్‍దు గెల్సి మహార్. వన్ని కియు అడ్గి డిప్తివలె, అమాలేకి లోకుర్ ఉద్దమ్‍దు గెల్సి మహార్. 12 నస్తివలె మోసే కికు వంద్‍జి మహె. అందెఙె వారు ఉండ్రి పణుకు వాండ్రు బస్ని వందిఙ్ బాన్ తతారె పహ్‍తార్ కక, వాండ్రు దన్ని ముస్కు బస్తాన్. ఆరోనుని హురు ఇనికార్ వన్ని కికాఙ్ ఒరెన్ ఉండ్రి కీదిఙ్, ఒరెన్ మరి ఉండ్రి కీదిఙ్ ముస్కు వెహ్తారె అస్త మహార్. అయా లెకెండ్ మోసే కికు పొద్దు డిగ్ని దాక కద్లిఎండ తినాఙ్ మహె. 13 నస్తివలె యెహోసువ అమాలేకి రాజుఙ్‍ని వన్ని సయ్‍నమ్‍దిఙ్ కూడఃమ్‍కాణిఙ్ ఉద్దం కిజి గెల్‍స్తాన్.
14 అయావలె యెహోవ మోసే వెట, “నాను యా అమాలేకి జాతి పేరు ఆగాసం అడ్గి సిల్లెండ నాసనం కినాలె. మరి యా ఉద్దం వందిఙ్‍ని ఇబ్బె ఇనిక జర్గితాదొ యా సఙతిఙ్ వందిఙ్ లోకురిఙ్ గుర్తు మంజిని లెకెండ్ ఉండ్రి గ్రందమ్‍దు రాసి ఇడ్అ. యా సఙతిఙ్ తప్ఎండ యెహోసువెఙ్ వెహ్తెఙ్ వలె”, ఇహాన్.